News June 4, 2024

ఐదేళ్ళ నిరీక్షణ ఫలించింది: గంటా

image

కూటమి సునామీలో వైసిపి కొట్టుకుపోయిందని భీమిలి కూటమి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎంవీపీ కాలనీలోని గంటా నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో 151 సీట్లతో అధికారం పొందిన వైసీపీ 2024లో తక్కువ స్థానాలకు పరిమితం అయిందన్నారు. కూటమి అభ్యర్థులపై ప్రజల విశ్వాసం ఉంచారని అన్నారు.

Similar News

News November 17, 2024

దమ్ముంటే ముందు హామీలు అమలు చెయ్: అరకు ఎంపీ

image

సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పేరిట మోసం చేశారంటూ వైఎస్.జగన్ అన్నారు. ఈ వీడియోను అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి తన ‘x’ అంకౌంట్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ పోస్ట‌పై ‘@ncbn నీకు దమ్ముంటే ముందు హామీలు అమలు చెయ్. చేతకాకుంటే పదవి నుంచి తప్పుకో. అంతేకానీ ప్రశ్నించే వాళ్లను జైలులో పెట్టి హీరోనని ఫీల్ అయిపోతే ఎలా?’ అంటూ రాసుకొచ్చారు.

News November 17, 2024

విశాఖ: ‘గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి చర్యలు’

image

గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఉత్తరాంధ్రలో 8 జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులతో విశాఖ పోలీస్ రేంజ్ కార్యాలయంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి సమావేశం నిర్వహించారు. గంజాయి సాగుకు ఆర్థికంగా మద్దతిస్తున్న వ్యాపారులపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

News November 17, 2024

గిరిజన విద్యార్థులు ఐఏఎస్ అధికారులుగా ఎదగాలి: కలెక్టర్

image

గిరిజన విద్యార్థులు ఐఏఎస్ అధికారులుగా ఎదగాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. శనివారం పాడేరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో లోచలపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల, తలారిసింగి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులతో కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారని, వారికి సహాయకారిగా ఉండాలని సూచించారు.