News June 4, 2024
ఐదేళ్ళ నిరీక్షణ ఫలించింది: గంటా
కూటమి సునామీలో వైసిపి కొట్టుకుపోయిందని భీమిలి కూటమి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎంవీపీ కాలనీలోని గంటా నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో 151 సీట్లతో అధికారం పొందిన వైసీపీ 2024లో తక్కువ స్థానాలకు పరిమితం అయిందన్నారు. కూటమి అభ్యర్థులపై ప్రజల విశ్వాసం ఉంచారని అన్నారు.
Similar News
News November 12, 2024
విశాఖ: వరకట్న వేధింపులతో వివాహిత సూసైడ్
వరకట్న వేధింపులతో విశాఖలో ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. 4వ టౌన్ పోలీసల వివరాల ప్రకారం.. దిల్లేశ్వరి అక్కయ్యపాలేనికి చెందిన రాజశేఖర్‌ని పెళ్లిచేసుకుంది. వ్యాపారం కోసం డబ్బులు కావాలని భర్త వేధించడంతో పుట్టింటి నుంచి రూ.6 లక్షలు తెచ్చింది. అయినప్పటికీ హింసించడంతో ఆదివారం సూసైడ్ చేసుకుంది. దిల్లేశ్వరి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి ఆమె భర్త, అత్తపై కేసు నమోదు చేశారు.
News November 12, 2024
బడ్జెట్‌లో విశాఖకు ఎన్ని వందల కోట్లు ఇచ్చారంటే?
సోమవారం జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌లో విశాఖ జిల్లాకు కేటాయించిన నిధుల వివరాలు ఇవే..
⁍ ఆంధ్రా యూనివర్సిటీకి రూ.389.34 కోట్లు
⁍ స్మార్ట్ సిటీలో భాగంగా GVMCకి రూ.20 కోట్లు
⁍విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు రూ.210.91 కోట్లు
⁍ మేహాద్రి గెడ్డలో సోలార్ పవర్‌కు రూ.6 కోట్లు
⁍ ప్రాంతీయ గ్రంథాలయం అభివృద్ధికి రూ.50 లక్షలు
⁍ విశాఖలో పోలీస్ స్టేషన్‌లకు రూ.58 కోట్లు
⁍ బాలుర వసతి గృహానికి రూ.42 లక్షలు
News November 12, 2024
అల్పపీడనంపై విపత్తు ఎండీతో హోం మంత్రి సమీక్ష
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఎండి రోణంకి కూర్మనాథ్‌తో రాష్ట్ర హోం&విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత విజయవాడలో సమీక్షించారు. తీసుకోవలసిన జాగ్రత్తలపై తగిన సూచనలు సలహాలు ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించానన్నారు.