News October 24, 2024

ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులుగా వనపర్తి వాసులు

image

భద్రాది కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఐద్వా రాష్ట్ర మహాసభలలో వనపర్తి జిల్లా ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. అధ్యక్ష కార్యదర్శులు సాయిలీల, లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలలో తీసుకున్న కర్తవ్యాలపై, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతూ సంఘం బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర కమిటీకి ఎన్నికైన సాయిలీల, లక్ష్మి లను పలు ప్రజాసంఘాల నాయకులు అభినందించారు.

Similar News

News January 11, 2026

పాలమూరుకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 17న పాలమూరుకు రానున్నారు. ఇటీవల MLA శ్రీనివాస్ రెడ్డి CMను కలిసి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు రావాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో సీఎం సానుకూలంగా స్పందించడంతో పర్యటన ఖరారైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. MBNR మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.12 వేల కోట్ల అంచనాలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే చెప్పారు.

News January 10, 2026

MBNR: ప్రభుత్వ వైద్య కళాశాలలో పలు పోస్టులకు దరఖాస్తులు

image

మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ రెసిడెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. ఆసక్తి గల వారు తమ అసలు ధ్రువపత్రాలతో కళాశాలకు రావాలని ప్రకటనలో పేర్కొన్నారు.

News January 10, 2026

MBNR: ఈ నెల 12న ఉద్యోగమేళా

image

మహబూబ్ నగర్ మహిళా సమైక్య కార్యాలయంలో ఈ నెల 12న మహేంద్ర ఆటోమేటిక్ డిజైన్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి తెలిపారు. సుమారు 200 ఖాళీలు ఉన్నాయని, పదో తరగతి, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో ఆ రోజు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.