News October 24, 2024
ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులుగా వనపర్తి వాసులు
భద్రాది కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఐద్వా రాష్ట్ర మహాసభలలో వనపర్తి జిల్లా ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. అధ్యక్ష కార్యదర్శులు సాయిలీల, లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలలో తీసుకున్న కర్తవ్యాలపై, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతూ సంఘం బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర కమిటీకి ఎన్నికైన సాయిలీల, లక్ష్మి లను పలు ప్రజాసంఘాల నాయకులు అభినందించారు.
Similar News
News November 3, 2024
విద్యుత్ వినియోగదారులకు ALERT.. ఫిర్యాదు చేయండి!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు అధికారులు అలర్ట్ ప్రకటించారు. నేడు(ఆదివారం) ‘విద్యుత్ వినియోగదారుల దినోత్సవం’ సందర్భంగా విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయా సబ్ డివిజన్ కార్యాలయంలో 9:00 గంటలకు వినియోగదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 3, 2024
NRPT: శ్రీశైలం వెళ్ళే భక్తులకు శుభవార్త
నారాయణపేట ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి రేపటి నుంచి బస్ సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. కార్తీకమాసం పురస్కరించుకొని బస్ సౌకర్యం కల్పించాలని అన్నారు. బస్టాండ్ నుంచి ప్రతి రోజూ ఉదయం 8:30 గంటలకు డీలక్స్ బస్ శ్రీశైలం బయలుదేరి వెళ్లి మళ్ళీ మధ్యాహ్నం 3:30 గంటలకు తిరిగి నారాయణపేటకు బయలుదేరుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
News November 3, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!
✔ఓపెన్ DEGREE, PG.. దరఖాస్తుకు గడువు పడగింపు
✔రేపటి నుంచి పెళ్లిళ్ల సీజన్ షురూ..DEC వరకు ముహూర్తాలే
✔SDNG:రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
✔మెస్ చార్జీలు పెంచడంతో విద్యార్థుల హర్షం
✔Way2Newsతో దివాలి భక్తులు
✔PUలో 6,7,8న సౌత్ జోన్ ఎంపికలు
✔ఇంటింటి సర్వేకు సర్వం సిద్ధం
✔నేటి నుంచి ప్రారంభమైన యాక్ట్-30
✔కురుమూర్తి స్వామికి సిద్ధమవుతున్న పట్టు వస్త్రాలు
✔BC సర్వేలో పాల్గొనే ఉపాధ్యాయులకు శిక్షణ