News March 5, 2025
ఐనవోలు: ఐలోని మల్లన్న హుండీ లెక్కింపు

ఈరోజు శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ లెక్కింపు జరిగింది. ఆదాయం గత నెల 18 నుంచి ఈనెల 3 వరకు 44 రోజులకు గాను రూ. 42,64,669 వచ్చాయి. వివిధ సేవా టిక్కెట్ల ద్వారా రూ. 1,35,94,297 ఆదాయం రాగా మొత్తం రూ. 1,78,58,966/- వచ్చాయని ఈవో తెలిపారు. హుండీలో వచ్చిన మిశ్రమ వెండి, బంగారం తిరిగి హుండీలో భద్రపరిచామని తెలిపారు. ఇందులో టెంపుల్ ఈవో అద్దంకి నాగేశ్వరరావు వారి సిబ్బంది, ఐలోని కానిస్టేబుల్స్ ఉన్నారు.
Similar News
News November 20, 2025
ఖమ్మం: నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్

ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగులకు CCTV ఇన్స్టాలేషన్, బ్యూటీషియన్ ఉచిత శిక్షణ ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ శిక్షణలో వసతి, భోజన సౌకర్యాలు ఫ్రీగా కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News November 20, 2025
HYD: అర్ధరాత్రి రోడ్లపై తిరిగిన ముగ్గురి యువకుల అరెస్ట్

అర్ధరాత్రి రోడ్లపై కారణం లేకుండా తిరుగుతున్న ముగ్గురు యువకులను టోలీచౌకీ పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులపై పెట్టీ కేసులు నమోదు చేసి, వారిని 3 – 7 రోజుల రిమాండు విధించారు. ఇకనుంచి ఎలాంటి కారణం లేకుండా అర్ధరాత్రి రోడ్లపై తిరగకూడదని ప్రజలను హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు హెచ్చరించారు.
News November 20, 2025
భిక్కనూర్: బొట్టు పెట్టి చీరలు అందజేయాలి: మంత్రి

భిక్కనూర్లో గురువారం మంత్రి సీతక్క ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమన్ని ప్రారంభించారు. ప్రతి లబ్ధిదారురాలికి తప్పనిసరిగా చీర అందేలా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి, చీరలను గౌరవప్రదంగా అందజేయాలని సూచించారు.


