News March 5, 2025

ఐనవోలు: ఐలోని మల్లన్న హుండీ లెక్కింపు

image

ఈరోజు శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ లెక్కింపు జరిగింది. ఆదాయం గత నెల 18 నుంచి ఈనెల 3 వరకు 44 రోజులకు గాను రూ. 42,64,669 వచ్చాయి. వివిధ సేవా టిక్కెట్ల ద్వారా రూ. 1,35,94,297 ఆదాయం రాగా మొత్తం రూ. 1,78,58,966/- వచ్చాయని ఈవో తెలిపారు. హుండీలో వచ్చిన మిశ్రమ వెండి, బంగారం తిరిగి హుండీలో భద్రపరిచామని తెలిపారు. ఇందులో టెంపుల్ ఈవో అద్దంకి నాగేశ్వరరావు వారి సిబ్బంది, ఐలోని కానిస్టేబుల్స్ ఉన్నారు.

Similar News

News February 9, 2026

దేనికోసం బాయ్‌కాట్? పాక్‌పై గంగూలీ ఫైర్

image

T20 WCలో భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలనే పాకిస్థాన్ నిర్ణయంపై గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎలాగూ శ్రీలంకలో ఆడుతున్నప్పుడు ఇబ్బందేంటని ప్రశ్నించారు. అసలు దేనికోసం ఈ నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. వరల్డ్ కప్‌లో ప్రతీ పాయింట్ ముఖ్యమేనని హితవు పలికారు. బంగ్లాకు మద్దతు పలుకుతూ Feb 15న కొలంబోలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాక్ బహిష్కరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

News February 9, 2026

KMR: రైతు బిడ్డ నుంచి మావోయిస్టు అగ్రనేత వరకు..

image

విప్లవ మార్గంలో మూడున్నర దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేసిన మావోయిస్టు అగ్రనేత లోకేటి చందర్ (అలియాస్ స్వామి, ప్రభాకర్) ప్రస్థానం గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. ఒక సామాన్య పేద రైతు కుటుంబంలో పుట్టి, వ్యవస్థపై కసితో తుపాకీ పట్టిన చందర్ జీవితం విప్లవ చరిత్రలో ఒక కీలక అధ్యాయం. అగ్రనేతలు లొంగిపోతున్నా, చివరి శ్వాస వరకు తుపాకీ వీడకుండా పోరాడి ప్రభాకర్ అమరుడయ్యారు.

News February 9, 2026

KMR: ప్రధాన పార్టీల అగ్ర నాయకుల రాక లేమి!

image

ప్రచార పర్వం మొదల నుంచి ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు బారాస, భాజపా పార్టీ అగ్ర నేతలు ఎవ్వరు కూడా కామరెడ్డి మున్సిపాలిటీలో ప్రచారానికి రాలేదు. బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడ లకు అన్ని పార్టీల అగ్రనేతలు వచ్చినప్పటికీ కామారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ మినహాయించి మిగతా పార్టీల అగ్ర నేతలు రాకపోవడం కొసమెరుపు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు గెలిపించే బాధ్యతలు వారే తీసుకున్నట్లు అనిపిస్తోంది!