News February 11, 2025
ఐనవోలు: పాడి పశువులపై మళ్లీ దాడి చేసిన హైనాలు!

HNK జిల్లా ఐనవోలు మండలంలోని గరిమెళ్లపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా పాడి పశువులపై హైనా దాడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నిన్న రాత్రి మళ్లీ పొలం వద్ద ఉన్న ఎడ్లపై దాడి చేయడంతో కొమ్ములతో హైనాలను పొడవపోయాయి. ఈ క్రమంలో ఎడ్లకు పలుచోట్ల గాయాలు అయ్యాయి. పాక వద్ద పడుకున్న ప్రభాకర్ వివరాల ప్రకారం.. రెండు హైనాలు వచ్చాయి. తనపై కూడా దాడి చేయగా కర్రలతో బెదిరించినట్లు తెలిపాడు.
Similar News
News January 8, 2026
Ashes: చివరి టెస్టులో ఆసీస్ విజయం

ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ చివరి(5వ) టెస్టులో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. 160 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆ జట్టులో లబుషేన్ 37, వెదర్లాండ్ 34, హెడ్ 29 రన్స్ చేశారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఇంగ్లండ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విజయంతో ఆస్ట్రేలియా సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది.
News January 8, 2026
నెల్లూరు జిల్లాలో లైసెన్సులు లేకుండానే..!

నెల్లూరు జిల్లాలో 165 kM మేర సముద్ర తీరం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఇస్కపాలెం, మైపాడు, కృష్ణపట్నం తదితర చోట్ల రొయ్యల చెరువులు ఉన్నాయి. ఎక్కువ భాగం ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తుండగా.. వాటికి మత్స్యశాఖ నుంచి లైసెన్సులు లేవు. అధికారికంగా 23వేల ఎకరాలే సాగు ఉండగా.. అనధికార చెరువులకు సైతం కరెంటు వాడుతున్నారు. మామూళ్ల మత్తులో మత్స్యశాఖ అధికారులు లైసెన్సులను చెక్ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.
News January 8, 2026
రివర్స్ కండీషనింగ్ గురించి తెలుసా?

సాధారణంగా తలస్నానం చేశాక కండీషనర్ రాస్తారు. కానీ షాంపూకి ముందుగా కండీషనర్‌ని ఉపయోగించే ప్రక్రియను రివర్స్ కండీషనింగ్ అంటారు. దీని వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ఈ టెక్నిక్ స్కాల్ప్ క్లీనింగ్‌లో ఉపయోగపడుతుంది. జుట్టును హెల్తీగా, హైడ్రేటెడ్‌గా చేస్తుంది. అలాగే కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. దీనికోసం సల్ఫేట్‌లు, పారాబెన్, సిలికాన్ లేని మాయిశ్చరైజింగ్ కండీషనర్‌ను ఎంచుకోవాలి.


