News February 3, 2025
ఐనవోలు: భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో పూజలు

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో గల శ్రీ భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం అమ్మవారి ఏకాదశ వార్షికోత్సవం, వసంత పంచమి సందర్భంగా విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, అమ్మవారికి నవకలశస్నపన, పంచామృత, నవరస, సుగంధపరిమళ ద్రవ్యాభిషేకం, చండీహవనం, మహనివేదన, నీరాజన మంత్రపుష్ప తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
Similar News
News December 5, 2025
ఎన్నికల నియమావళి అమలు చేయాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళిని ప్రణాళిక ప్రకారం అమలు చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించాలని, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, రవాణా, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ప్రతి పనిని పక్కాగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.
News December 5, 2025
1,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు: కలెక్టర్

మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కూరగాయల సాగును పెంచాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. కలెక్టర్ చాంబర్లో శుక్రవారం ఉద్యాన శాఖపై సమీక్షించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి మండలంలో కనీసం 1,000 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి జరగాలని, నీటి సదుపాయం లేని చోట రుణాల ద్వారా బోర్వెల్స్ ఏర్పాటు చేసి సాగు పెంచాలని ఆదేశించారు.
News December 5, 2025
అన్నమయ్య: 8 మంది స్మగ్లర్లు అరెస్ట్

సానిపాయ అటవీ పరిధిలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి 12 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ కడప సబ్ కంట్రోల్ RSI నరేష్, స్థానిక FBO అంజనా స్వాతి తెలిపారు. శుక్రవారం రాయవరం సెక్షన్ చిన్నముచ్చురాళ్ల గుట్ట వద్ద తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాకు చెందిన స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని కేసునమోదు చేశామన్నారు.


