News February 3, 2025
ఐనవోలు: భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో పూజలు

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో గల శ్రీ భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం అమ్మవారి ఏకాదశ వార్షికోత్సవం, వసంత పంచమి సందర్భంగా విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, అమ్మవారికి నవకలశస్నపన, పంచామృత, నవరస, సుగంధపరిమళ ద్రవ్యాభిషేకం, చండీహవనం, మహనివేదన, నీరాజన మంత్రపుష్ప తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
Similar News
News February 10, 2026
రామప్ప స్థల పురాణం ఏంటో తెలుసా?

రామప్ప ఆలయాన్ని క్రీ.శ 1213లో కాకతీయ రాజు రేచర్ల రుద్రుడు కట్టించారు. ఎత్తయిన వేదిక మీద తూర్పు ముఖమున ద్వారాలతో నిర్మాణం చేశారు. గుడిలో గర్భాలయం, అర్థ మండపం, సభా మండపాలు కలవు. మూడు వైపులా ప్రవేశ ద్వారాలు కలవు. గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నులుపు రాతితో చెక్కిన పెద్ద లింగం కలదు. ఆలయ ప్రాంగణంలో కామేశ్వర, కోటేశ్వర ఆలయాలు కలవు. నంది మండపం ప్రత్యేక ఆకర్షణ.
News February 10, 2026
మంచిర్యాల: డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన ఆర్టీసీ డ్రైవర్

మద్యం తాగి బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్ పోలీసులకు పట్టుబడ్డాడు. సోమవారం సాయంత్రం బెల్లంపల్లి చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానం వచ్చి కోరుట్ల డిపోకు చెందిన బస్ డ్రైవర్ జక్కుల మల్లేశ్‌ను పరీక్షించగా మద్యం తాగినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మజారుద్దీన్ తెలిపారు.
News February 10, 2026
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు: మల్లన్న క్షేత్రంలో నేడు హంసవాహన సేవ

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి హంసవాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి అధికారులు స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.


