News March 7, 2025

ఐనవోలు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని గ్రామంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. అయితే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. క్షతగాత్రుడు ఇల్లంద గ్రామానికి చెందిన నిమ్మనబోయిన రమేశ్(38)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 10, 2025

సంగారెడ్డి జిల్లాలో 122 టెన్త్ పరీక్ష కేంద్రాలు

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు 122 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సంవత్సరం 22,411 మంది విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

News March 10, 2025

MHBD: డోర్నకల్‌కు యంగ్ ఇండియా గురుకులం

image

యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ.11 వేల కోట్లను విద్యాశాఖ మంజూరు చేసింది. 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఒక్కో స్కూల్​కు రూ.200 కోట్లు చొప్పున పరిపాలన అనుమతులను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గంలో ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

News March 10, 2025

PHOTOS: ట్రోఫీతో క్రికెటర్లు

image

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గి భారత జట్టు 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ధోనీ సారథ్యంలో 2013లో గెలిచాక 2017లోనూ అవకాశం వచ్చినా ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి పాలైంది. అయితే ఈ సారి వచ్చిన ఛాన్స్‌ను రోహిత్ సేన ఒడిసిపట్టుకుంది. హిట్ మ్యాన్ నాయకత్వంలో సమిష్టిగా రాణిస్తూ ఒక్క ఓటమి లేకుండా కప్పును అందుకుంది. ఈ క్రమంలో కప్పుతో క్రికెటర్లు ఫొటోలకు పోజులిచ్చారు.

error: Content is protected !!