News March 22, 2025
ఐపీఎల్లో అందరి దృష్టి కాకినాడ కుర్రాడి వైపే

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ పండగ ప్రారంభమవుతుంది. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కుర్రాడు పెన్మత్స సత్యనారాయణరాజు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. గోదావరి జిల్లాల ప్రజల చూపు ఇప్పుడు అతడిపైనే ఉంది. మొదటిసారి ఐపీఎల్లో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. రంజీ పోటీల్లో ఎనిమిది మ్యాచ్లో 17 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మన కాకినాడకు చెందిన కుర్రాడు ఎలా ఆడతాడో వేచి చూడాలి.
Similar News
News November 25, 2025
విషతుల్యమవుతున్న తల్లిపాలు

తల్లిపాలు స్వచ్ఛమైనవి, కల్తీలేనివని మనం అనుకుంటాం. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల తల్లి పాలల్లో మైక్రోప్లాస్టిక్ అవశేషాలున్నట్లు గతంలో పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే తాజాగా బిహార్లో చేసిన ఓ పరిశోధనలో తల్లిపాలలో యురేనియం అవశేషాలున్నట్లు గుర్తించారు. ఇవన్నీ ఇలాగే కొనసాగితే మానవ మనుగడే కష్టం అంటున్నారు నిపుణులు. ఇప్పటికైనా మేలుకొని పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
News November 25, 2025
భూపాలపల్లి: పంచాయతీ ఎన్నికలపై పార్టీల ఫోకస్!

జిల్లాలో 248 పంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ గుర్తులు లేకుండా జరుగుతున్నప్పటికీ, తమ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలుపొందేలా ప్రధాన పార్టీల నాయకులు దృష్టి సారించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పంచాయతీ పోరును పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సర్పంచ్ అభ్యర్థులపై నియోజకవర్గ స్థాయి నాయకులు ఆరా తీస్తున్నారు.
News November 25, 2025
ఇవాళ ఉదయం 10 గంటలకు

వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇవాళ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల కోటా(రూ.300)ను టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను రిలీజ్ చేయనుంది. టికెట్ల కోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని TTD తెలిపింది. దళారులను నమ్మి మోసపోవద్దని, నకిలీ వెబ్ సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.


