News March 22, 2025

ఐపీఎల్‌లో అందరి దృష్టి కాకినాడ కుర్రాడి వైపే

image

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ పండగ ప్రారంభమవుతుంది. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కుర్రాడు పెన్మత్స సత్యనారాయణరాజు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. గోదావరి జిల్లాల ప్రజల చూపు ఇప్పుడు అతడిపైనే ఉంది. మొదటిసారి ఐపీఎల్‌లో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. రంజీ పోటీల్లో ఎనిమిది మ్యాచ్లో 17 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మన కాకినాడకు చెందిన కుర్రాడు ఎలా ఆడతాడో వేచి చూడాలి.

Similar News

News April 23, 2025

సత్యసాయి శత జయంతికి రూ.100 నాణెం

image

శ్రీసత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు వచ్చే ఏడాది నవంబర్ 23 నాటికి పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో రూ.100 నాణేన్ని విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 44mm చుట్టుకొలత, 35 గ్రాముల బరువు ఉండే ఈ నాణెంలో 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ ఉంటుంది. ఒకవైపు అశోక స్తంభం, మరోవైపు సత్యసాయిబాబా చిత్రం, 1926 నంబర్ ఉంటుంది.

News April 23, 2025

వరంగల్ చపాటా అంటే నర్సంపేటనే..!

image

చపాటా మిర్చి పంట సాగుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పెట్టింది పేరు. కానీ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సాగయ్యేది నర్సంపేట నియోజకవర్గంలో మాత్రమే. విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఈ చపాటా మిర్చిని మొదట నల్లబెల్లికి చెందిన రైతులు సాగు చేశారు. తర్వాత నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ తదితర మండలాల్లోని రైతులు ఈ రకం మిర్చి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఈ మిర్చికి భౌగోళిక గుర్తింపు వచ్చింది.

News April 23, 2025

9 నుంచి 27 ర్యాంక్‌కు పడిపోయిన ADB జిల్లా

image

ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. ADB జిల్లాలో ఫస్టియర్ 9,106 మంది పరీక్షలు రాయగా 4,967 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 8,890కి 6,291 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం ఫస్టియర్‌లో 54.55, సెకండియర్‌లో 70.76గా నమోదైంది. ఫస్టియర్‌లో రాష్ట్రంలో జిల్లా గతేడాది 9వ స్థానంలో ఉండగా.. ఈసారి 27వ స్థానంలో నిలిచింది. సెకండియర్ గతేడాది 13వ ప్లేస్‌లో ఉండగా ఈసారి 12వ స్థానంలో నిలిచింది.

error: Content is protected !!