News April 4, 2024

ఐబీఆర్ అచీవర్‌గా బుర్రిలంక బుడ్డోడు

image

కడియం మండలం బుర్రిలంకకు చెందిన ఈలి రుత్విక్  సంవత్సరం 6 నెలల వయసులో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ‘ఐబీఆర్ అచీవర్’ గా నిలిచాడు. 25 రకాల చర్యలను నిర్దేశిత సమయంలో పూర్తి చేసి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ బుడతడు ప్రతిభను మెచ్చుకొని పలువురు అభినందనలు తెలిపారు.

Similar News

News November 27, 2025

రాజమండ్రి: 29న మెగా జాబ్ మేళా

image

రాజమండ్రి కలెక్టరేట్ పరిసరాల్లోని ‘వికాస’ కార్యాలయం సమీపంలో నవంబర్ 29వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన, 35 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల యువత తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7660823903 నంబరును సంప్రదించాలని కోరారు.

News November 27, 2025

జిల్లాలో 1.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి: జేసీ

image

ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ అంచనాగా నిర్ణయించినట్లు జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ వెల్లడించారు. గురువారం నాటికి మొత్తం 34,737 కొనుగోలు కూపన్లు రైతులకు జారీ చేశామని తెలిపారు. జిల్లాలోని 18 మండలాల్లో ఏర్పాటు చేసిన 201 కొనుగోలు కేంద్రాల ద్వారా, ఇప్పటివరకు 21,794 మంది రైతుల నుంచి 1,61,611.920 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

News November 27, 2025

తూ.గో రైతులకు ముఖ్య గమనిక

image

ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించి ఫిర్యాదులు, సందేహాల పరిష్కారం కోసం స్థానిక బొమ్మూరు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందని వెల్లడించారు. రైతులు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏ సమస్య ఉన్నా 8309487151 నంబర్‌కు సంప్రదించి సహాయం పొందవచ్చని సూచించారు.