News July 14, 2024
ఐరాల: డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా.. ఒకరు మృతి

ఐరాల మండలం చిగరపల్లె వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. తెలంగాణ సూర్యాపేటకు చెందిన ఏడుగురు తిరుమల దర్శనానికి వచ్చారు. అనంతరం కాణిపాకం దర్శనానికి వస్తుండగా చీగరపల్లె వంతెన వద్ద ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 22, 2025
చిత్తూరు: రూ.7కోట్ల దొంగతనం.. ఐదుగురు అరెస్ట్

బెంగళూరులో ATMకు తరలిస్తున్న రూ.7.19 కోట్లను దోపిడీ చేసిన కేసులో కర్ణాటక పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఇదివరకే సస్పెండ్ అయిన పోలీస్ అన్నప్ప నాయక్, చోరీలో కీలకంగా వ్యవహరించిన జేవియర్, గోపి, నెల్సన్, నవీన్‌ను అరెస్టు చేసి సిద్దాపుర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చిత్తూరు జిల్లా గుడిపాల వద్ద ఇన్నోవా కారును వదిలి వ్యాగనార్ కారులో పరారైన జేవియర్‌ను తమిళనాడులో అరెస్ట్ చేసి బెంగళూరుకు తీసుకెళ్లారు.
News November 22, 2025
పుంగనూరు: రూ.770కు చేరిన టమాటా

తుఫాను నేపథ్యంలో టమాటా దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరులోని మార్కెట్ యార్డుకు శనివారం 57.94 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. నాణ్యత కలిగిన టమాటా 15 కిలోల బాక్స్ రూ.770 పలికింది. రెండో రకం రూ.500, మూడో రకం రూ.300 చొప్పున కొనుగోలు చేశారు.
News November 22, 2025
GDనెల్లూరులో తారస్థాయికి వర్గపోరు..?

GDనెల్లూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట తారస్థాయికి చేరుకుంది. MLA థామస్, భీమనేని చిట్టిబాబు మధ్య అంతర్గత విభేదాలు కార్యకర్తలకు, నాయకులకు మధ్య చిచ్చు రాజేస్తోంది. భీమినేని చిట్టిబాబు జిల్లా అధ్యక్షుని పదవి రేసులో ఉన్నారు. దీనిని థామస్ అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారట. థామస్ కుటుంబ సభ్యుల్లో కొందరు ఆయనకు వ్యతిరేకంగా, చిట్టిబాబు వెంట నడుస్తున్నట్లు సమాచారం. ఇది ఎటు వెళుతుందో చూడాలి మరి.


