News February 19, 2025
ఐరాల: మహిళా ఉద్యోగులను వేధిస్తున్న వ్యక్తికి దేహశుద్ధి

మహిళా బ్యాంకు ఉద్యోగులను వేధిస్తున్న వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం మేరకు.. కాణిపాకంకు చెందిన భూపాల్ వైఎస్ గేటులో ఉన్న ఓ బ్యాంకులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను చిత్తూరు నుంచి బస్సులో వస్తుండగా నిత్యం వేధిస్తున్నాడు. ఈ వేధింపులపై ఆగ్రహించిన స్థానికులు అతనిని కరెంటు స్తంభానికి కట్టి దేహశుద్ధి చేశారు.
Similar News
News March 24, 2025
చిత్తూరు: మహిళా VRO ఆత్మహత్య

చిత్తూరులోని సంజయ్ గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న ముత్తుకూరు VRO తనీషా (31) కుటుంబ కలహాలతో శనివారం విషం ద్రావణం తాగారు. కుటుంబ సభ్యులు గమనించి చీలాపల్లి సీఎంసీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. ఏడేళ్ల క్రితం రమేశ్‌తో తనీషాకు వివాహమైంది. వారికి పిల్లలు లేరు. ఈ ఘటనపై వన్ టౌన్ సీఐ జయరామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. కాగా రమేశ్ ఆర్మీలో పని చేస్తున్నారు.
News March 24, 2025
రూ.1.14 కోట్ల విద్యుత్ బిల్లులు వసూలు

విద్యుత్ బిల్లుల చెల్లింపుల కేంద్రానికి ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను చిత్తూరు, తిరుపతి జిల్లాలలోని వినియోగదారులు సద్వినియోగం చేసుకున్నారు. రెండు జిల్లాలలో మొత్తం10 వేల 200 మంది వినియోగదారులు బిల్లులు చెల్లించగా.. కోట్లు వసూలు అయినట్లు ట్రాన్స్కో ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, సురేంద్రనాయుడు వెల్లడించారు.
News March 24, 2025
చిత్తూరు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహణ

చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం ఉ.9.30 గం.ల నుంచి మ.1 గం. వరకు కలెక్టరేట్‌లోని సమావేశపు మందిరంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు ఉ.9 గం. కల్లా తప్పక హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నియోజక వర్గ, మండల స్థాయి అధికారులందరూ విధిగా హాజరుకావాలని ఆదేశించారు.