News February 20, 2025
ఐరాల: రోడ్డు ప్రమాదంలో బాలుడి స్పాట్ డెడ్

ఐరాల(M) కాణిపాకపట్నం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై తిరుపతి(D) మంగళంకు చెందిన లక్ష్మయ్య అతని భార్య, కుమారుడు కిరణ్ బైకు మీద తిరుపతి నుంచి పలమనేరు వెళ్తున్న సమయంలో లారీని తప్పించబోయి డివైడర్ ఢీకొట్టారు. ఈ ఘటనలో కిరణ్ (11) అక్కడికక్కడే మృతిచెందగా లక్ష్మయ్య, అతని భార్యకు తీవ్ర గాయాలు కావడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 25, 2025
మహిళలకు నేడు వడ్డీ లేని రుణాల పంపిణీ

TG: 3.50 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వడ్డీ లేని రుణాలను అందించనుంది. ఇందుకోసం నిన్న సంఘాల ఖాతాల్లో రూ.304 కోట్లు జమ చేసింది. నేడు అన్ని నియోజకవర్గాల్లో ఉ.11 గంటలకు ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించాలని Dy.CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం ఆ స్కీమ్‌ను పునరుద్ధరించామని పేర్కొన్నారు.
News November 25, 2025
GNT: సంక్రాంతి రైళ్లకు ఇప్పుడే వెల్లువ.!

వచ్చే ఏడాది సంక్రాంతి రద్దీ ప్రభావం ముందే కనిపిస్తోంది. రెండు నెలల ముందుగానే రిజర్వేషన్లు తెరవడంతో ప్రధాన రైళ్లలో బెర్తులు పూర్తిగా నిండిపోయాయి. పలు రైళ్లలో వెయిటింగ్ లిస్ట్‌లు శతకానికి ఎగబాకగా, కొన్నింటిలో నోరూమ్ సందేశాలు దర్శనమిస్తున్నాయి. హౌరా, సికింద్రాబాద్, బెంగళూరు మార్గాల్లో డిమాండ్ అధికం. రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు ముందుగానే బుకింగ్ చేసుకోవడంతో పరిస్థితి మరింత కఠినమైంది.
News November 25, 2025
అనంతపురం: దాడి కేసులో ఏడుగురి అరెస్ట్

అనంతపురం నగరం సాయి నగర్ 3rd క్రాస్‌లోని శ్రీనివాస మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై దాడిచేసి ధ్వంసం చేసిన ఘటనలో అడ్వకేట్ మొగలి సత్యనారాయణరెడ్డితోపాటు ఏడుగురుని అరెస్టు చేసినట్లు 2 టౌన్ సీఐ శ్రీకాంత్ తెలిపారు. నిందితులను 14 రోజుల రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించామని పేర్కొన్నారు. దాడికి ఉపయోగించిన మూడు కార్లు, బైక్, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.


