News December 5, 2024
ఐరాల: హైవేపై ప్రమాదం.. ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన ఐరాలలో చోటుచేసుకుంది. చిత్తూరు-పీలేరు జాతీయ రహదారిపై ఐరాల మండలం చుక్కవారిపల్లి వద్ద బైకును గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో బైక్‌పై వెళ్తున్న తెల్లగుండ్లపల్లికి చెందిన ఆత్మయ్య మృతి చెందగా.. సురేశ్ గురవయ్య గాయపడ్డారు. గాయపడ్డవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 5, 2025
చిత్తూరు: ‘తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి’

పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. చిత్తూరు మండలంలోని తుమ్మింద జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం పోటీ తత్వం ఎక్కువగా ఉందని విద్యార్థులు రాణించాలంటే క్రమశిక్షణతో కూడిన పట్టుదల, కృషి అవసరమన్నారు.
News December 5, 2025
స్థానికులపై చిన్నచూపు లేదు: TTD ఈవో

వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో తిరుపతి స్థానికులకు అన్యాయం జరిగిందని.. మొదటి మూడు రోజులు దర్శనాలు కల్పించి ఉంటే బాగుండేదని తిరుపతికి చెందిన చంద్రశేఖర్ డయల్ యువర్ TTD ఈవోలో కోరారు. ‘వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజులు పవిత్రమైనవే. అందరినీ దృష్టిలో పెట్టుకుని, స్థానికులకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతోనే చివరి మూడు రోజులు దర్శనాలకు కేటాయించాం. స్థానికులపై చిన్న చూపు లేదు’ అని ఈవో అనిల్ సింఘాల్ సమాధానమిచ్చారు.
News December 5, 2025
నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.


