News January 28, 2025
ఐలాపురం జాతరకు రావాలని పీవోకు ఆహ్వానం

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపూర్‌లో ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు నిర్వహించే సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చిత్రామిశ్రాకు సోమవారం పూజారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పూజారి సంఘం అధ్యక్షుడు మల్లెల రవి, పీరీల భాస్కర్, పులిశ బాలు, తిరు పతి, సురేష్, పొడెం బాబు, ఆలం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 8, 2025
కరుణ్ నాయర్ మరో సెంచరీ

డొమెస్టిక్ క్రికెట్‌లో విదర్భ ప్లేయర్ <<15137627>>కరుణ్ నాయర్<<>> వీరవిహారం చేస్తున్నారు. రంజీ క్వార్టర్ ఫైనల్-2లో భాగంగా తమిళనాడుతో మ్యాచులో ఆయన మరో సెంచరీ బాదారు. 180 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నారు. కాగా విజయ్ హజారే ట్రోఫీలోనూ కరుణ్ 5 సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. దీంతో ఆయన టీమ్ ఇండియాకు సెలక్ట్ అవుతారని అందరూ భావించారు. కానీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్‌కు BCCI ఎంపిక చేయలేదు.
News February 8, 2025
ప్రాంతీయ పార్టీలకు గడ్డుకాలం.. నెక్స్ట్ టార్గెట్ బెంగాలేనా?

దేశంలో ప్రాంతీయ పార్టీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఏపీలో వైసీపీ, తెలంగాణలో BRS, ఒడిశాలో బిజూ జనతాదళ్, MHలో శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు అధికారాన్ని కోల్పోయాయి. ఏపీలో టీడీపీ, బిహార్‌లో JDU ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నాయి. ప.బెంగాల్‌లో మమతా బెనర్జీ, TNలో స్టాలిన్ బలంగా నిలబడ్డారు. మోదీ నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మీ కామెంట్?
News February 8, 2025
కేన్ విలియమ్సన్ మరో ఘనత

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ మరో ఘనత అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్టు, వన్డే, టీ20లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన 17వ ఆటగాడిగా కేన్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 18,685 పరుగులు సాధించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ హషీమ్ ఆమ్లా (18,672) రికార్డును చెరిపేశారు. పాక్‌తో జరుగుతున్న వన్డేలో కేన్ ఈ ఫీట్ సాధించారు. ఈ జాబితాలో సచిన్ (34,357) అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు.