News April 10, 2024

ఐసీయూలో ఉన్న రోగి బంగారు ఆభరణాలు చోరి

image

నిజామాబాద్ ద్వారకానగర్‌లోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగికి సంబంధించిన రెండు తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఈ విషయమై రోగి కుటుంబీకులు ఒకటో టౌన్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. తమకు అందిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నట్లు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ విజయ్ బాబు తెలిపారు.

Similar News

News December 10, 2025

TU: డిగ్రీ పరీక్షలకు 11 మంది గైర్హాజరు

image

టీయూ పరిధిలోని డిగ్రీ-సీబీసీఎస్- I, III ,V సెమిస్టర్ (రెగ్యులర్), II, IV, VI సెమిస్టర్ (2021, 2022, 2023, 2024, 2025 బ్యాచ్‌ల) బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఉమ్మడి NZB జిల్లా వ్యాప్తంగా 30 సెంటర్లలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం 18వ రోజు మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 83 మంది విద్యార్థులకు 72 మంది హాజరయ్యారు. 11 మంది గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.

News December 10, 2025

NZB: మూడో విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మూడో విడతలో ఎన్నికలు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో బుధవారం నిర్వహించారు. కలెక్టరేట్‌లోని ఎన్ఐసీ హాల్‌లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ చేపట్టారు. ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు.

News December 10, 2025

NZB: ఓటింగ్ కోసం 18 రకాల గుర్తింపు కార్డులు: కలెక్టర్

image

ఈ నెల 11, 14, 17 తేదీల్లో 3 విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లేప్పుడు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దాన్ని తమ వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఓటర్, ఆధార్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు ఫోటోతో కూడిన పోస్ట్ ఆఫీస్, బ్యాంక్ పాస్ బుక్‌లు తీసుకెళ్లాలన్నారు.