News March 27, 2025
ఐ.పోలవరం: అత్తింటి వేధింపులు..4 నెలల గర్భిణి సూసైడ్

తాళ్లరేవులోని గండివారిపాలెంలో 4 నెలల గర్భిణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరంలోని జి. వేమవరానికి చెందిన ప్రవళ్లిక (21)కు తాళ్లరేవుకు చెందిన రాంబాబుతో ఏడాది క్రితం పెళ్లైంది. కొన్ని నెలలుగా అత్తింటివారి అదనపుకట్నం కోసం వేధిస్తున్నారని యువతి తండ్రి ఆరోపించారు. దీంతో గర్భిణి అయిన తన కుమార్తె ఆత్నహత్య చేసుకుందని విలపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Similar News
News December 3, 2025
కల్వకుర్తి ఆస్పత్రి.. 24 గంటల్లో 20 కాన్పులు

కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో గడచిన 24 గంటలలో 20 కాన్పులు జరిగినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం తెలిపారు. ఇందులో 11 నార్మల్ డెలివరీలు, 9 సిజేరియన్ కాన్పులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో విజయవంతంగా కాన్పులు చేసిన ఆసుపత్రి సిబ్బందిని సూపరింటెండెంట్ అభినందించారు.
News December 3, 2025
ఏలూరు: మార్నింగ్ వాక్ చేస్తుండగా ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని మృత్యువు కారు రూపంలో కబళించింది. ఈ ఘటన ఏలూరు రూరల్ శ్రీపర్రు గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన ఘంటసాల రంగరాజు(55), ఇందుకూరి సుబ్బారావు మార్నింగ్ వాక్ చేస్తుండగా కైకలూరు నుంచి ఏలూరు వస్తున్న కారు వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో రంగరాజు మృతిచెందగా సుబ్బారావు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
News December 3, 2025
వేగంగా కాదు.. క్షేమంగా వెళ్లండి: సిద్దిపేట సీపీ

వేగంగా వెళ్లడం కాదు.. క్షేమంగా వెళ్లడం ముఖ్యమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్.ఎం.విజయ్ కుమార్ పేర్కొన్నారు. అతివేగం ఎప్పటికైనా ప్రమాదమే అని, వేగంగా వెళ్లి ప్రాణాలు కోల్పోవద్దని కోరారు. మీ నిర్లక్ష్యం ఇతరులకు శాపం కావద్దన్నారు. మీ క్షేమం కోసమే ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. అతివేగంతో వెళ్లి మీ కుటుంబాన్ని రోడ్డున పడేయొద్దని అన్నారు.


