News February 17, 2025

ఐ.పోలవరం: బ్రిడ్జిపై నుంచి దూకి వృద్ధుడి ఆత్మహత్య

image

ఐ.పోలవరం మండలం మురమళ్ల బ్రిడ్జిపై నుంచి దూకి పశువుల్లంకకు చెందిన చింతలపూడి శ్రీనివాసరావు (66) శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. అతని మృతదేహం ఆదివారం లభ్యమయింది. అల్లుడు రవికుమార్ వేధింపులు భరించలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య అమ్మాజీ ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెకు విడాకులు ఇవ్వకుండా కొంతకాలం నుంచి అల్లుడు ఇబ్బంది పెడుతున్నాడన్నారు. దీనిపై ఎస్సై మల్లికార్జున రెడ్డి కేసు నమోదు చేశారు.

Similar News

News October 25, 2025

SBI క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాడ్‌న్యూస్

image

క్రెడిట్ కార్డు పేమెంట్లపై ఛార్జీల పెంపునకు SBI సిద్ధమైంది. వీటి ద్వారా వాలెట్లలో రూ.1000 కంటే ఎక్కువ మనీ లోడ్ చేస్తే 1% ఛార్జీ పడనుంది. ఎడ్యుకేషన్ ఫీజులను థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లించినా 1% రుసుము విధించనుంది. అయితే స్కూల్, కాలేజ్ లేదా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్లు, POS మెషీన్ల ద్వారా చెల్లిస్తే ఎలాంటి ఛార్జీ ఉండదు. పెంచిన ఛార్జీలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

News October 25, 2025

విశాఖలో సెలవులు రద్దు: కలెక్టర్

image

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాబోయే 72 గంటలు అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు, పెనుగాలుల ప్రమాదం ఉన్నందున అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.

News October 25, 2025

HYD: ఉస్మానియా అండర్ గ్రౌండ్‌లో మార్చురీ నిర్మాణం

image

HYD గోషామహల్ గ్రౌండ్‌లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ఉన్నతాధికారుల బృందం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఉస్మానియా నూతన ఆసుపత్రికి సంబంధించి పలు డిజైన్లను మార్చిన అధికారులు, భూగర్భంలో మార్చురీ నిర్మించాలని నిర్ణయించినట్లుగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు. ఈ మేరకు ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతున్నట్లు ప్రైమరీ ప్లానింగ్ రిపోర్టులో పేర్కొన్నారు.