News March 11, 2025

ఐ.పోలవరం: మోసం చేసిన వ్యక్తికి రెండేళ్లు జైలు శిక్ష

image

ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కేసులో ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి చెందిన ముక్తేశ్వరరావుకు రెండేళ్లు కఠిన కారాగార శిక్ష విధించారని ఎస్సై మల్లికార్జున రెడ్డి సోమవారం తెలిపారు. ముమ్మిడివరం మెజిస్ట్రేట్ కోర్టు జడ్జ్ మహమ్మద్ రహమతుల్లా ఈ తీర్పు ఇచ్చారన్నారు. జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 2021లో అప్పటి ఎస్సై కేసు నమోదు చేశారన్నారు.

Similar News

News December 4, 2025

పెద్దపల్లి: పోస్ట్ బాక్సులు.. గుర్తున్నాయా..?

image

ఒకప్పుడు లేఖలతో పోస్ట్ బాక్సులు కళకళలాడేవి. ఆత్మీయుల శుభాకాంక్షలు, మనసులోని మాటలతో పలకరించేవి. అలాంటి మధుర జ్ఞాపకాలకు నెలవైన పోస్ట్ డబ్బాలు నేడు కనుమరుగయ్యాయి. ఫోన్లు, సోషల్ మీడియా రాకతో ఆ తపాలా పెట్టెలు ఆదరణ కోల్పోతున్నాయి. నేడు కేవలం ఖాళీ పెట్టెలు అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. PDPL(D) ధర్మారంలో తీసిన చిత్రమిది. ఇక అప్పటి మధుర జ్ఞాపకాలను మోసిన పోస్ట్ బాక్సులతో మీకున్న అనుబంధాన్ని COMMENT చేయండి.

News December 4, 2025

కాగజ్‌నగర్‌లో మళ్లీ పులి భయం

image

కాగజ్‌నగర్ డివిజన్‌లో మళ్లీ పులి భయం మొదలైంది. నవంబర్ నెలలోనే నలుగురు పులి దాడిలో మరణించారు. పులులు నవంబర్, డిసెంబర్ నెలల్లో తమ ఆవాసం, తోడు కోసం సంచరిస్తుంటాయి. తన ప్రయాణంలో ఎక్కడా స్థిరపడకుండా రోజుకు కనీసం 10 కిలోమీటర్లకు పైగా తిరుగుతాయి. నిలకడ లేని పులులు దాడులు చేసే అవకాశాలు ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పెంచికల్పేట్ మండలంలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు.

News December 4, 2025

KMR: మరోసారి అవకాశం కల్పిస్తా ఈ సారికి ఆగు..!

image

పంచాయతీ ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి విడత, రెండవ విడత నామినేషన్ల స్వీకరణ పూర్తి కాగా మూడో విడత కొనసాగుతోంది. ఈసారి తమకు అనుకూలంగా రిజర్వేషన్ రావడంతో ఒకే వర్గానికి చెందిన పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో ఒకరినొకరు బుజ్జగిస్తున్నారు. నామినేషన్లు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. మరోసారి నీకు అవకాశం కల్పిస్తా ఈసారికి ఆగు అన్నట్లు మాట్లాడుతున్నారు.