News March 11, 2025
ఐ.పోలవరం: మోసం చేసిన వ్యక్తికి రెండేళ్లు జైలు శిక్ష

ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కేసులో ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి చెందిన నందెపు ముక్తేశ్వరరావుకు రెండేళ్లు కఠిన కారాగార శిక్ష విధించారని ఎస్సై మల్లికార్జున రెడ్డి సోమవారం తెలిపారు. ముమ్మిడివరం మెజిస్ట్రేట్ కోర్టు జడ్జ్ మహమ్మద్ రహమతుల్లా ఈ తీర్పు ఇచ్చారన్నారు. జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారని చెప్పారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు 2021లో అప్పటి ఎస్సై కేసు నమోదు చేశారన్నారు.
Similar News
News February 10, 2026
ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలి: నల్గొండ ఎస్పీ

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన నాకాబందీ చేపట్టారు. 48 గంటల ‘మౌన కాలం’ అమల్లోకి రావడంతో ప్రచారాలు, సభలపై నిషేధం విధించారు. సెక్షన్ 163 అమలు చేస్తూ అక్రమ నగదు, మద్యం తరలింపుపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.
News February 10, 2026
ఘోర ప్రమాదం.. 53 మంది మృతి

లిబియా తీరంలో విషాదకర ఘటన జరిగింది. పలు ఆఫ్రికన్ దేశాల వలసదారులతో ప్రయాణిస్తున్న బోటు మునిగిపోవడంతో ఇద్దరు శిశువులు సహా 53 మంది దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు మాత్రమే బతికినట్లు UN మైగ్రేషన్ ఏజెన్సీ వెల్లడించింది. లిబియాలోని జావియా సిటీ నుంచి బయలుదేరిన 6 గంటలకు బోటు మునిగిపోయినట్లు తెలిపింది. ఈ ఏడాదిలో ఇప్పటికే మధ్యదరా సముద్రాన్ని దాటేందుకు ప్రయత్నించి దాదాపు 500 మంది చనిపోయినట్లు పేర్కొంది.
News February 10, 2026
ఖమ్మం: దివ్యాంగులకు అలర్ట్.. దరఖాస్తుకు నేడే ఆఖరు!

దృష్టి, వినికిడి లోపం ఉన్న దివ్యాంగులు ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి రోజని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి వెల్పుల విజేత తెలిపారు. అర్హులు ఈ సాయంత్రంలోగా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడువు దాటిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబోమని ఆమె స్పష్టం చేశారు.


