News February 28, 2025
ఐ.పోలవరం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌డెడ్

ఐ.పోలవరం మండలం పాతఇంజరం వద్ద అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ముమ్మిడివరం(M) కర్రివానిరేవుకు చెందిన మట్టా ఆకాష్ రెడ్డి, కొండేపూడి సిద్దార్థ కుమార్ బైక్‌పై యానాం నుంచి కర్రివానిరేవుకు వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఐ.పోలవరం పోలీసులు మృతదేహాలను ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 27, 2026
వనపర్తి: అదనపు కలెక్టర్‌గా ఖీమ్యా నాయక్ బాధ్యతలు

వనపర్తి జిల్లా నూతన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా ఖీమ్యా నాయక్ ఐఏఎస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, వేగానికి ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు.
News February 27, 2026
NZB: క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు నేటి నుంచే రిజిస్ట్రేషన్లు

హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హన్మకొండ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి మొదలైందని DYSO పవన్ కుమార్ తెలిపారు. 3వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని, మార్చి13 నుంచి 17 వరకు మండల, 28 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లా, 27 నుంచి మే 1 వరకు రాష్ట్ర స్థాయి ఎంపికలు ఉంటాయని ఆయన తెలిపారు. నేటి నుంచి మార్చి 4 వరకు https:///tgss.telangana.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు.
News February 27, 2026
భద్రాద్రిలో వైభవంగా నిత్య కళ్యాణం

భద్రాద్రి రామాలయంలో శుక్రవారం సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ ఉత్సవ మూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం అనంతరం కంకణధారణ గావించి కల్యాణాన్ని జరిపారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.


