News April 5, 2025

‘ఐ లవ్ సూళ్లూరుపేట’.. మీరు చూశారా?

image

సూళ్లూరుపేటకు కొత్త అందం వచ్చింది. పట్టణ పరిధిలోని హోలీ క్రాస్ జంక్షన్ దగ్గర ‘ఐ లవ్ సూళ్లూరుపేట’ అనే ఎల్ఈడీ లైటింగ్ బోర్డును మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది. ఇది పట్టణ ప్రజలతో పాటు హైవేపై వెళ్లే వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఫ్లెమింగో పక్షి, చెంగాలమ్మ ఆలయం, రాకెట్ నమూనాలతో ఈ బోర్డు ఉండటం విశేషం.

Similar News

News December 3, 2025

ఖమ్మం: అర్ధరాత్రి పొద్దుపోయేంతవరకు నామినేషన్లు

image

ఖమ్మం జిల్లాలో రెండో విడత నామినేషన్ల దాఖలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి పొద్దుపోయేంతవరకు నామినేషన్లు దాఖలు చేశారు. 6 మండలాల్లో మొత్తం 183 గ్రామపంచాయతీలకు గాను 1055 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా 1686 వార్డులకు గాను 4160 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కూసుమంచి మండలంలో అత్యధికంగా సర్పంచ్ పదవికి 250 మంది నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.

News December 3, 2025

VJA: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి.. కోర్టు తీర్పు ఇదే.!

image

పోక్సో కేసులో నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఓ బాలికతో 2021వ సంవత్సరంలో అదే ప్రాంతానికి చెందిన వసంత్ కుమార్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి ఫిర్యాదు మేరకు వసంత్ కుమార్‌పై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మంగళవారం నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి భవాని తీర్పునిచ్చారు.

News December 3, 2025

భద్రాద్రి: జాతిపితను పట్టించుకునేదెవరో?

image

బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన కూడలిలోని మహాత్మా గాంధీ విగ్రహం పగుళ్లు వచ్చి, దయనీయ స్థితిలో ఉన్నా పట్టించుకునేవారు లేరని స్థానికులు వాపోతున్నారు. జయంతి, వర్ధంతుల సమయంలో చూపిన శ్రద్ధ, విగ్రహం ఆహార్యంపై చూపడం లేదన్నారు. కళ్లజోడు, చేతికర్ర లేకపోవడంతో స్థానికులు తాత్కాలికంగా జామాయిల్ కర్రను చేతిలో ఉంచారు. మాటలు చెప్పే నాయకులు జాతిపిత విగ్రహాన్నే పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.