News December 2, 2024
‘ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి’

ఒంగోలు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటుకు రూ.700 కోట్లు కేటాయించాలని సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో మాట్లాడుతూ.. వర్షం వస్తే మురుగు కాలువలు పొంగి రోడ్ల మీదకు చేరుతుందన్నారు. ఈ సమస్యకు పరిష్కారం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణమేనని చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం నేత రమేశ్ పాల్గొన్నారు.
Similar News
News April 10, 2026
ప్రకాశం: ఐరన్ ఓర్ నిక్షేపాల గుర్తింపు

కందుకూరు నియోజకవర్గం VVపాలెం, లింగసముద్రం మండలాల్లో ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారణైంది. నాణ్యమైన మాగ్నటైట్ ఐరన్ ఓర్ ఉన్నట్లు గుర్తించారు. JSW గ్రూప్‌నకు కాంపోజిట్ లైసెన్స్ లభించగా తవ్వకాలకు సిద్ధమవుతోంది. భూముల సేకరణను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. 2187 చ.కి.మీ విస్తీర్ణంలో నిక్షేపాలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక్కడ ప్రభుత్వ, అటవీ, ప్రైవేట్ భూములు ఉన్నాయి.
News April 10, 2026
మార్కాపురంలో ఏప్రిల్ 11న పూలే జయంతి: కలెక్టర్

మహాత్మా జ్యోతి బాపూలే జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 11వ తేదీన మార్కాపురంలోని తర్లుపాడు రోడ్డులోని విద్యుత్ కార్యాలయం వద్ద పూలే జయంతి వేడుకలు జరపనున్నట్లు తెలిపారు. అదే విధంగా కలెక్టరేట్‌లో కూడా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.