News April 28, 2024

ఒంగోలులో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

image

సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఒంగోలులోని గొడుగుపాలెంలో శనివారం వేకువజామున జరిగింది. ఒకటో పట్టణ సీఐ ఎం.లక్ష్మణ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న షేక్ ముస్తాక్ కుమార్తె ఆరిఫా సుల్తానా(19) నగరంలోని రైజ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అవడంతో ఇంట్లో ఉరేసుకుంది. ఘటనపై కేసు నమోదైంది.

Similar News

News October 23, 2025

ప్రకాశం: ఇళ్లు కట్టుకునేవారికి GOOD NEWS

image

రాష్ట్ర ప్రభుత్వం ‘ హౌసింగ్ ఫర్ ఆల్ ‘ పథకంలో భాగంగా పేదలకు సొంత ఇంటి స్థలం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నందున అర్హులు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ..GO ఎంఎస్ నెంబర్ -23 ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇంటి స్థలం కేటాయిస్తామని అన్నారు. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News October 23, 2025

వర్షం ఎఫెక్ట్.. ప్రకాశం జిల్లాకు NDRF బృందాలు

image

ప్రకాశం జిల్లాకు మరో రెండు రోజులపాటు భారీ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగానికి హోంమంత్రి అనిత బుధవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు NDRF బృందాలను పంపించేలా ఆమె ఆదేశించారు. దీంతో ప్రకాశం జిల్లాపై ఎలాంటి తుఫాన్ ప్రభావం ఉన్నా ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులు, కలెక్టర్ రాజాబాబు సారథ్యంలో సిద్ధమయ్యారు.

News October 23, 2025

మార్కాపురం జిల్లా ఏర్పాటుకు మరో అడుగు

image

మార్కాపురం జిల్లా ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను పంపించాలని భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ జి.జయలక్ష్మి చెప్పారు. బుధవారం ఆమె అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒంగోలు ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ పి.రాజాబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా ప్రతిపాదనపై సుదీర్ఘ చర్చ సాగగా.. ప్రతిపాదనలపై దృష్టి సారించాలని కలెక్టర్‌కు జయలక్ష్మి సూచించారు.