News April 2, 2025
ఒంగోలులో ఇలా చేస్తున్నారా..?

ప్రకాశం ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ఏకకాలంలో దాడులు చేశారు. ఒంగోలు తాలుకా PS పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేయగా.. బహిరంగంగా మద్యం తాగుతూ ముగ్గురు పట్టుబడ్డారు. ఇలాగే బహిరంగంగా మద్యం తాగితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Similar News
News October 26, 2025
ప్రకాశం: తుఫాన్.. 3 రోజులు స్కూల్స్‌కు సెలవులు!

ప్రకాశం జిల్లాకు ముంథా తుఫాన్ కారణంగా 27, 28, 29 తేదీల్లో 3 రోజులపాటు అన్ని పాఠశాలలకు కలెక్టర్ రాజాబాబు సెలవులు ప్రకటించారు. తుఫాన్ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ఆదివారం ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలు వాగుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 26, 2025
ప్రకాశం: విద్యార్థులకే సెలవు.. టీచర్లు బడికి రావాల్సిందే!

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రేపటినుంచి 3 రోజులపాటు పాఠశాలలకు తుఫాను కారణంగా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఒంగోలులో DEO కిరణ్ కుమార్ మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించడం జరిగిందన్నారు. కానీ <<18111249>>టీచర్లు<<>> విపత్కర పరిస్థితుల్లో సాయం అందించేందుకు విధులకు హాజరుకావాలన్నారు.
News October 26, 2025
CMతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ప్రకాశం కలెక్టర్

ప్రకాశం కలెక్టర్ రాజబాబు ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సీఎం వివరించారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం చేపట్టిన ముందస్తు జాగ్రత్తలను కలెక్టర్ వివరించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.


