News August 19, 2024
ఒంగోలులో టెన్షన్ టెన్షన్

ఒంగోలులో ఈరోజు నుంచి 24 వరకు రీ మాక్ పోలింగ్‌ను అధికారులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేశారు. ఈవీఎంలు, ఓటింగ్ సరళిపై అనుమానాలు ఉన్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి అభ్యంతరం తెలపడంతో అధికారులు మాక్ పోలింగ్‌కు ఏర్పాటు చేశారు. ఒంగోలు నియోజకవర్గంలోని మొత్తం 12 కేంద్రాల్లో ఈ ప్రక్రియ జరగనుంది. దీంతో ఏం జరగనుందా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Similar News
News July 11, 2025
ఒంగోలు: రూ.20వేల సాయం.. 2రోజులే గడువు

కేంద్రం సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇవ్వనుంది. జిల్లాలో 4.38లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకోగా రూ.2.72లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఇందులోనూ కొందరూ ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. అలాగే ఇంకా ఎవరైనా అర్హులుగా ఉంటే ఈనెల 13వ తేదీలోగా రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు సూచించారు
News July 11, 2025
ఒంగోలుకు రావడానికి ఇబ్బందులు..!

ప్రకాశం జిల్లాలోని పలు పల్లెల నుంచి ఒంగోలు రావడానికి సరైన సమయాల్లో బస్సులు లేవు. ఉదయం వేళలో స్కూల్, కాలేజీకి వెళ్లే విద్యార్థులు సైతం బస్సుల కొరతతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఉదయాన్నే 6 గంటలకు బస్సులు వస్తున్నాయి. ఆ తర్వాత 10పైనే బస్సులు అందుబాటులో ఉంటున్నాయి. 8 గంటల ప్రాంతంలో బస్సులు తిప్పాలని పలువురు కోరుతున్నారు. మీ ఊరికి ఇలాగే బస్సు సమస్య ఉంటే కామెంట్ చేయండి.
News July 10, 2025
కనిగిరి: జనసేనలో చేరిన దేవకి వెంకటేశ్వర్లు

కనిగిరికి చెందిన జాతీయ వాసవి సత్ర సముదాయాల ఛైర్మన్ దేవకి వెంకటేశ్వర్లు బుధవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. వెంకటేశ్వర్లకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు మరి కొంతమంది ఆర్యవైశ్య ప్రముఖులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల వైసీపీకి వెంకటేశ్వర్లు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.