News October 9, 2024

ఒంగోలులో ప్రాథ‌మిక ఆహార ప‌రీక్ష‌ల ప్రయోగశాల: మంత్రి స‌త్య‌కుమార్

image

రాష్ట్రంలో ఆహార భ‌ద్ర‌తా ప్ర‌మాణాల్ని మ‌రింత‌ పెంపొందించ‌డానికి భార‌త ఆహార భ‌ద్ర‌తా ప్ర‌మాణాల సంస్థతో, ఏపీ ప్ర‌భుత్వం రూ.88.41 కోట్ల‌తో మంగ‌ళ‌వారం న్యూఢిల్లీలో ఒప్పందాన్ని (MoU) కుదుర్చుకుంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌తో కలిసి ఒప్పందప‌త్రాల‌పై సంత‌కాలు చేశారు. ఒప్పందాలలో భాగంగా ఒంగోలుల‌లో ప్రాథ‌మిక ఆహార ప‌రీక్ష‌ల ప్రయోగశాల రూ. 7.5 కోట్ల‌తో నెల‌కొల్ప‌నున్నాట్లు మంత్రి తెలిపారు.

Similar News

News November 24, 2025

ఒంగోలు: విచారణకు తీసుకొస్తే.. పారిపోయారు?

image

ఒంగోలులో పోలీసుల విచారణకు వచ్చిన ఇద్దరు అనుమానితులు పోలీస్ స్టేషన్ నుంచి పరారైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒంగోలులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు ఒంగోలుకు చెందిన ఇద్దరు అనుమానితులను తీసుకువచ్చి చోరీలపై పోలీసులు విచారించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే పోలీసుల కళ్లుగప్పి ఆ ఇద్దరు పరారైనట్లు సమాచారం. దీనితో పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News November 24, 2025

ఒంగోలు: క్రికెట్ తెచ్చిన కుంపటి.. 12 మందిపై కేసు నమోదు!

image

ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగమూరు రోడ్డులో క్రికెట్ కారణంగా ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరువురి ఫిర్యాదు మేరకు 12 మంది పై కేసు నమోదు చేసినట్లు ఒంగోలు తాలూకా సీఐ విజయ్ కృష్ణ తెలిపారు. ఆదివారం మంగమూరు రోడ్డు సమీపంలో క్రికెట్ ఆడుతున్న రెండు బ్యాచ్‌లలో విభేదాలు తలెత్తి ఒక్కసారిగా ఘర్షణ పడ్డారు. దీంతో రెండు జట్లకు చెందిన 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 24, 2025

రాచర్ల: పొలంలో నీళ్లు పెడుతుండగా.. కరెంట్ షాక్‌కి గురై..

image

రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన చిట్టిబాబు చిన్న కుమారుడు రాజేశ్ విద్యుత్ షాక్‌కు గురై ఆదివారం మృతి చెందారు. మొక్కజొన్న పొలంలో నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.