News November 14, 2024

ఒంగోలులో ప్రారంభమైన బంగారు బాలోత్సవాలు

image

ఒంగోలులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తమిమ్ అన్సారియా ఆధ్వర్యంలో గురువారం బంగారు బాలోత్సవాలు ప్రారంభమయ్యాయి. బాలల స్వేచ్ఛకు ప్రతీకతగా గాలిలోకి బెలూన్స్ వదిలారు. బాలల హక్కులు, వారికున్న రక్షణ చట్టాలు, ప్రభుత్వ పథకాలపై వారం రోజులు గ్రామ స్థాయిలో ప్రత్యేక అవగాహనను కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News April 11, 2026

ప్రకాశం: పెన్షన్ ఫ్రాడ్‌లపై SP హెచ్చరిక

image

పెన్షన్ ఫ్రాడ్‌లపై అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని.. బ్యాంకు అధికారులమని చెప్పి ఓటీపీలు, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అడిగి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎవరూ వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

News April 10, 2026

నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌పై జాగ్రత్త: SP

image

ప్రకాశం జిల్లా SP హర్షవర్ధన్ రాజు సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా మోసాలు పెరుగుతున్నట్లు హెచ్చరించారు. Facebook, Instagram, Twitterలో తెలిసిన వారి పేర్లతో ఫేక్ అకౌంట్లు సృష్టించి డబ్బులు అడుగుతున్నారని అన్నారు. అలాంటి సందేశాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఫోన్ చేసి నిర్ధారించుకోవాలని సూచించారు. మోసానికి గురైతే 1930కు కాల్ చేయాలని, లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.