News November 13, 2024
ఒంగోలులో ఫీల్డ్ ఎయిర్ పోర్టు.?

ఆంధ్రప్రదేశ్‌లో 6 ఎయిర్‌పోర్టుల ఫీజిబిలిటీపై సర్వే మొదలుపెట్టారు. అందులో ప్రకాశం జిల్లా ఒంగోలులో 657 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ప్రకాశం జిల్లాతో పాటు మరో 5చోట్ల ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అధ్యయనం చేయడానికి రూ.2.27 కోట్లు విడుదల చేయనున్నారు.
Similar News
News December 3, 2025
సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రకాశం కలెక్టర్.!

ప్రకాశం కలెక్టర్ రాజాబాబు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ రాజాబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఒక్కొక్క అధికారి, ఒక్కొక్క వసతి గృహాన్ని దత్తత తీసుకోవాలని కలెక్టర్ నిర్ణయించారు. దీంతో ఆయా వసతి గృహాల్లో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కార దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
News December 3, 2025
ప్రకాశం: ఆకలితో అలమటించిన విద్యార్థులు.. వార్డెన్ సస్పెండ్.!

విధుల పట్ల అలసత్వం వహించిన కొనకనమిట్ల సాంఘిక సంక్షేమ వసతి గృహ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాజాబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించకపోవడంతో విద్యార్థులు పడిన ఇబ్బందులపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక మేరకు వార్డెన్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.