News March 24, 2025

ఒంగోలులో ESI ఆసుపత్రి స్థాపించాలి: మాగుంట

image

ఒంగోలులో ESI ఆసుపత్రిని స్థాపించాలని పార్లమెంట్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. రూల్ నం. 377 క్రింద ఆసుపత్రి ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రకాశం జిల్లాలో 3003 కర్మాగారాలలో 86000 మంది ఉద్యోగ కార్మికులు ఉన్నారని, వారందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఈఎస్ఐ ఆసుపత్రి స్థాపించాలని మాగుంట కోరారు.

Similar News

News March 29, 2025

సెలవు రోజు కూడా బిల్లులు చెల్లించవచ్చు: ప్రకాశం SE

image

ప్రకాశం జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులు కట్టే కేంద్రాలు 30,31వ తేదీల్లో పనిచేస్తాయని జిల్లా విద్యుత్ శాఖ ఎస్.ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలులో శనివారం ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యం కోసం సెలవు రోజుల్లో కూడా బిల్లు కట్టించుకుంటారని తెలిపారు. కాబట్టి వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరారు. నెలాఖరు అయినా తక్కువ చెల్లింపులు జరిగాయని అన్నారు.

News March 29, 2025

ప్రకాశం: DCO సరెండర్

image

జిల్లా సహకార అధికారి(DCO)ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా సహకార సంఘం అన్ని విధాలా వెనుకబడి ఉంది. దీనికి తోడు సంబంధిత అధికారి శ్రీనివాసరెడ్డి ఆ శాఖను సమన్వయం చేయటంలో విఫలమయ్యారని తేలింది. ఆ శాఖ ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో కలెక్టర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

News March 29, 2025

ప్రకాశం: మీకూ ఇలాంటి కాల్స్ వచ్చాయా..?

image

ప్రకాశం జిల్లాలో కాల్స్ చేసి బెదిరించడం ఎక్కువైపోయింది. ఈక్రమంలో SP దామోదర్ ఓ ప్రకటన చేశారు. ACB అధికారులమంటూ వచ్చే కాల్స్‌పై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తప్పు చేశారని.. అరెస్ట్ కాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ప్రజలు, అధికారులను బెదిరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫేక్ ఐడీ కార్డులతోనూ మోసాలు చేస్తుంటారని.. ఎక్కడైనా ఇలా జరిగితే 91211 02266కు వాట్సప్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.

error: Content is protected !!