News March 24, 2025
ఒంగోలులో ESI ఆసుపత్రి స్థాపించాలి: మాగుంట

ఒంగోలులో ESI ఆసుపత్రిని స్థాపించాలని పార్లమెంట్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. రూల్ నం. 377 క్రింద ఆసుపత్రి ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రకాశం జిల్లాలో 3003 కర్మాగారాలలో 86000 మంది ఉద్యోగ కార్మికులు ఉన్నారని, వారందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఈఎస్ఐ ఆసుపత్రి స్థాపించాలని మాగుంట కోరారు.
Similar News
News April 24, 2025
ఒంగోలు: నోటిఫికేషన్ విడుదల

ఏపీలో నిన్న టెన్త్ ఫలితాలు వెలువడడంతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT- AP) పరిధిలోని ఒంగోలు IIITలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఆర్జీయూకేటీ అధికారులు విడుదల చేశారు. ఈనెల 27న ఉ. 10 గంటల నుంచి మే 20వ తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తు గడువు ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News April 24, 2025
రాష్ట్రంలో చివరి స్థానంలో ప్రకాశం జిల్లా

ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. జిల్లావ్యాప్తంగా ఓపెన్ ఇంటర్‌లో 3,668 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే.. 547 మంది పాస్ అయినట్లు అధికారులు వెల్లడించారు. 14.9 శాతంతో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా 26వ స్థానంలో నిలిచింది. అలాగే ఓపెన్ టెన్త్‌లో 1,184 మంది పరీక్షలు రాస్తే.. 88 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 7.4 శాతంతో జిల్లా 21వ స్థానంలో నిలిచింది.
News April 24, 2025
పొదిలి: రోడ్డుపై మద్యం లారీ బోల్తా.. ఎగబడ్డ జనం

పొదిలి మండలం సలకనూతల వద్ద మార్కాపురం నుంచి దర్శికి మద్యం లోడ్‌తో వెళుతున్న వాహనం బుధవారం ప్రమాదానికి గురై రోడ్డుపై బొల్తాపడింది. మద్యం బాటిళ్లు రోడ్డుపై పడగా.. మద్యం ప్రియులు వాటి కోసం ఎగబడ్డారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు.