News August 9, 2024
ఒంగోలులో YCPకి షాక్

ఒంగోలులోని 13వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కొప్పర్ల కమలమ్మ MLA జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం కమలమ్మ మాట్లాడుతూ.. జనార్దన్ హయాంలో ఒంగోలు గతంలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఇకముందు కూడా మరింత అభివృద్ధి చేస్తారని నమ్మకంతోనే చేరామన్నారు. జనార్దన్ సమక్షంలో పార్టీలో చేరటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మరోవైపు మేయర్ కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందని పార్టీ సన్నిహితులు తెలిపారు.
Similar News
News December 13, 2025
ప్రకాశం జిల్లాలో 5.26 లక్షల సంతకాల సేకరణ

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా సేకరించిన సంతకాల పత్రాలను వైసీపీ రాష్ట్ర కార్యాలయానికి సోమవారం తరలిస్తామని దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా జిల్లాలో 5.26 లక్షల మంది సంతకాలు చేశారని చెప్పారు. వాటిని ప్రత్యేక వాహనం ద్వారా వైసీపీ ఆఫీసుకు తరలిస్తామన్నారు.
News December 13, 2025
ప్రకాశం: గ్యాస్ ఏజెన్సీలకు నోటీసులు

ప్రకాశం జిల్లాలోని 24 గ్యాస్ ఏజెన్సీలకు జేసీ గోపాలకృష్ణ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గ్యాస్ డెలివరీ సమయంలో అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా తేలింది. ఇకపై డెలివరీ బాయ్ ప్రవర్తన, రసీదుకు మించి డబ్బులు ఎక్కువగా వసూలు చేసినా ఉపేక్షించేది లేదని జేసీ హెచ్చరించారు. మీ ఏరియాలో సిలిండర్ డెలివరీకి ఎక్కువ నగదు తీసుకుంటే ఊరిపేరు, ఏజెన్సీ పేరుతో కామెంట్ చేయండి.
News December 13, 2025
ప్రకాశం: చర్చి పాస్టర్లకు కీలక సూచన

ప్రకాశం జిల్లాలోని పాస్టర్లకు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి కీలక సూచన చేశారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న పాస్టర్లు.. వారి చర్చి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాల పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను గవర్నమెంట్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. ఆ పత్రాలను ఎంపీడీవో, కమిషనర్ కార్యాలయాల్లో లేదా ఒంగోలులోని జిల్లా మైనార్టీ కార్యాలయంలో అందజేయాలని కోరారు.


