News January 10, 2025

ఒంగోలు: ‘అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తే చర్యలు’

image

సంక్రాంతి సందర్భంగా ప్రైవేటు వాహనదారులు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు ఉప రవాణా కమిషనర్ ఆర్.సుశీల హెచ్చరించారు. తన కార్యాలయంలో ప్రైవేటు వాహనాల యజమానులతో ఆమె సమావేశం నిర్వహించారు. డ్రైవర్, క్లీనర్లు ప్రయాణికులతో గౌరవంగా మెలగాలని సూచించారు. డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు. వాహనానికి సంబంధించిన రికార్డులు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.

Similar News

News December 20, 2025

ఒంగోలులో రూ.40వేల వేతనంతో జాబ్స్..!

image

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఈ జాబ్ మేళాకు ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నట్లు చెప్పారు. 10th నుంచి ఏదైనా డిగ్రీ చదివిన 18-35 ఏళ్లలోపు వయస్సు గలవారు అర్హులు. జీతం రూ.40వేల వరకు పొందే అవకాశం ఉందన్నారు.

News December 20, 2025

ప్రకాశం: మీకు ఈ కార్డులు అందాయా..?

image

ప్రకాశం జిల్లాలో ఇంకా కొందరు వివిద కారణాలతో తీసుకోని 38408 స్మార్ట్ రేషన్ కార్డులు అలానే ఉన్నాయన్నది అధికారిక లెక్క. మొత్తం 651820 స్మార్ట్ కార్డులు రాగా, అక్టోబర్ 11న అధికారులు పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. డీలర్లు, సచివాలయ సిబ్బంది ఇప్పటికి 613412 కార్డులను పంపిణీ చేశారు. మిగిలిన 38408 కార్డుల సంగతి అధికారులు తేల్చాల్సిఉంది. కార్డులు తీసుకోకపోతే వెనక్కి పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

News December 20, 2025

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇదే టాక్.!

image

ప్రకాశం పాలి’ ట్రిక్స్’లో ఎప్పుడు ఏ ప్రచారం జరుగుతుందో ఊహించడం కష్టమే. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో రోజుకొక ప్రచారం సాగుతోంది. ఇటీవల బాలినేని గురించి ప్రకాశంలో తీవ్ర చర్చ సాగుతోంది. త్వరలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని ప్రచారం ఉండగా, అంతకు ముందు బాలినేనికి MLC పదవి వరించనుందని టాక్. ఇదే ప్రచారం బాలినేని జనసేనలోకి వెళ్లిన సమయంలోనూ సాగడం విశేషం.