News December 18, 2024

ఒంగోలు: ఆయన ఎంత అదృష్టవంతుడో..!

image

తండ్రీకొడుకు, భార్యాభర్త అనురాగం ఎంత గొప్పదో తెలిపే ఘటన ఇది. కట్టుకున్న వాడి కోసం కిడ్నీని, కన్నతండ్రి కోసం కాలేయాన్నే వదులుకున్న త్యాగమూర్తుల కథ ఇది. ఒంగోలుకు చెందిన రామారావు(54)కు కిడ్నీ, లివర్ ఫెయిల్ అయ్యాయి. ఎవరైనా అవయవాలు డొనేట్ చేస్తారేమోనని చూసినా ఫలితం లేకపోయింది. నాగవల్లి కిడ్నీని, కౌశిక్ లివర్‌లో కొంత భాగాన్ని రామారావుకు ఇవ్వడంతో హైదరాబాద్ డాక్టర్లు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. 

Similar News

News November 26, 2025

29న ఒంగోలులో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు

image

ఒంగోలులోని డీఆర్ఆర్ఎం హై స్కూల్లో ఈనెల 29న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులను క్రీడా పోటీలలో సైతం ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.

ప్రకాశం: తుఫాన్‌ను లెక్కచేయని వనిత.. అసలు స్టోరీ ఇదే!

image

నాగులుప్పలపాడు మండలం పోతవరానికి చెందిన మహిళా రైతు వనిత.. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2021 నుంచి ఇదే పద్ధతి పాటిస్తున్న ఆమె అద్భుత విజయాలు సాధించారు. ప్రస్తుతం మొక్కజొన్న, కంది, బీరకాయ పంటలను 2.20 ఎకరాల భూమిలో సాగు చేశారు. మొన్న మొంథా తుఫాన్‌తో మిగిలిన రైతుల పంట దెబ్బతింటే, ఈమె పంట సేఫ్. దీంతో రూ.8500 పెట్టుబడి ఖర్చుకు రూ.53,460 ఆదాయం గడించారు.