News December 18, 2024
ఒంగోలు: ఆయన ఎంత అదృష్టవంతుడో..!
తండ్రీకొడుకు, భార్యాభర్త అనురాగం ఎంత గొప్పదో తెలిపే ఘటన ఇది. కట్టుకున్న వాడి కోసం కిడ్నీని, కన్నతండ్రి కోసం కాలేయాన్నే వదులుకున్న త్యాగమూర్తుల కథ ఇది. ఒంగోలుకు చెందిన రామారావు(54)కు కిడ్నీ, లివర్ ఫెయిల్ అయ్యాయి. ఎవరైనా అవయవాలు డొనేట్ చేస్తారేమోనని చూసినా ఫలితం లేకపోయింది. నాగవల్లి కిడ్నీని, కౌశిక్ లివర్‌లో కొంత భాగాన్ని రామారావుకు ఇవ్వడంతో హైదరాబాద్ డాక్టర్లు విజయవంతంగా ఆపరేషన్ చేశారు.
Similar News
News January 25, 2025
ఒంగోలు: గణతంత్ర వేడుకల ఏర్పాట్ల పరిశీలన
76వ గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమం నిర్వహించే పోలీసు పరేడ్ గ్రౌండ్‌ను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. SP దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణలతో కలిసి పరిశీలించారు. ఈ వేడుకలలో పాల్గొనేందుకు, వీక్షించేందుకు వచ్చేవారి హోదాను, సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
News January 24, 2025
ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయాకు అవార్డు
ఉత్తమ ఎన్నికల అధికారిగా ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా ఎంపికయ్యారు. బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ కింద ఈ పురస్కారం వరించింది. జిల్లా కలెక్టర్‌తో పాటు. దర్శి మండలం తహశీల్దార్ శ్రావణ్ కుమార్ ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరికి శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో పురస్కారాల ప్రదానం జరుగుతుంది.
News January 24, 2025
ప్రకాశం జిల్లా కలెక్టర్‌ను కలిసిన మహిళా ఉద్యోగులు
ఏపీ JAC అమరావతి మహిళా విభాగం ప్రకాశం జిల్లా చైర్ పర్సన్ జయలక్ష్మి గురువారం కలెక్టర్ తమీమ్ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు, వారు పనిచేసే చోట వాష్ రూమ్స్ ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. అసోసియేషన్ భవనం ఏర్పాటు చేయుటకు పట్టణంలో స్థలం కేటాయించవలసిందిగా అర్జీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ సానుకూలంగా స్పందించారని జయలక్ష్మి తెలిపారు.