News September 27, 2024

ఒంగోలు: ఇకపై ఆలయంలో UPI చెల్లింపులు

image

ఒంగోలులోని శ్రీగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తుల సౌకర్యార్థం UPI చెల్లింపు విధానానికి శ్రీకారం చుట్టినట్లు ధర్మకర్తల మండలి ఛైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, కార్య నిర్వహణ ధర్మకర్త సీవీ రామకృష్ణారావు వెల్లడించారు. గురువారం శ్రీగిరి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. UPI ద్వారా నగదు చెల్లింపు ప్రక్రియ గురించి భక్తులకు వివరించారు.

Similar News

News November 25, 2025

నేపాల్‌లో 8 మంది పామూరు యువకులు అరెస్టు

image

బెట్టింగుల కోసం దేశాలు దాటి పామూరు యువకులు జైలు పాలైన సంఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే.. నేపాల్ దేశంలో జరుగుతున్న ఎన్పీఎల్ క్రికెట్‌పై ఆన్‌లైన్‌లో బెట్టింగ్ కాసేందుకు పామూరుకు చెందిన 8 యువకులు బెంగుళూరు నుంచి విమానం ద్వారా నేపాల్‌కి చేరుకున్నట్లు సమాచారం. నేపాల్‌కి వెళ్లెందుకు పాస్‌పోర్ట్ అవసరం లేకపోవడంతో ఆధార్ కార్డుపై నేపాల్ వెళ్లారు. పోలీసుల పక్కా సమాచారంతో 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

News November 25, 2025

ప్రకాశం: సందేహాలు ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి.!

image

పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని డీఈఓ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పదవతరగతి ఫీజు చెల్లింపులు, నామినల్ రోల్స్ సమయంలో ఇబ్బందులు ఉన్నయెడల వాటి పరిష్కారానికి స్పెషల్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే 9848527224, 8985601722కు సంప్రదించాలన్నారు.