News September 27, 2024

ఒంగోలు: ఇకపై ఆలయంలో UPI చెల్లింపులు

image

ఒంగోలులోని శ్రీగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తుల సౌకర్యార్థం UPI చెల్లింపు విధానానికి శ్రీకారం చుట్టినట్లు ధర్మకర్తల మండలి ఛైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, కార్య నిర్వహణ ధర్మకర్త సీవీ రామకృష్ణారావు వెల్లడించారు. గురువారం శ్రీగిరి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. UPI ద్వారా నగదు చెల్లింపు ప్రక్రియ గురించి భక్తులకు వివరించారు.

Similar News

News October 10, 2024

ప్రకాశం: ఈ కష్టం ఎవరికీ రాకూడదు..!

image

అతనో పేద రైతు. ఎంతో కష్టపడ్డాడు. అయినా సరే అప్పులే మిగిలాయి. మరోవైపు ఎదిగి వచ్చిన కుమార్తె పెళ్లి. తప్పనిస్థితిలో మరో రూ.3 లక్షలు అప్పు తెచ్చి ఇంట్లో పెట్టాడు. అర్ధరాత్రి ఆ నగదును దొంగలు దోచేశారు. ఉదయాన్నే నిద్రలేచిన రైతుకు డబ్బు కనపడకపోవడంతో బోరున విలపించారు. ఈ <<14311035>>బాధాకరమైన<<>> ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపాలునిపల్లె గ్రామంలోని వీరంరెడ్డి వాసుదేవరెడ్డి ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి జరిగింది.

News October 10, 2024

ALERT: పొగాకు ఎక్కువ పండించకండి

image

టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో బుధవారంతో కొనుగోళ్లు పూర్తయ్యాయి. మొత్తం 16.1 మిలియన్ల పొగాకు కొనుగోళ్లు చేసినట్లు వేలం కేంద్రం అధికారి అట్లూరి శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది కిలో పొగాకు సరాసరి రూ.221లు రైతులకు లభించింది. ఈ ఏడాదికి రూ.279 అందినట్లు చెప్పారు. ప్రస్తుత ధర పోల్చుకుని పొగాకు అత్యధికంగా పండిస్తే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించారు.

News October 10, 2024

ప్రకాశం: విధులకు వస్తూ MRO మృతి

image

ప్రకాశం జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. అర్ధవీడు మండల MRO కుక్కమూడి దాసు (54) యర్రగొండపాలెం నుంచి విధులకు బయల్దేరగా మార్గమధ్యలో అస్వస్థతకు గురయ్యారు. మార్కాపురంలో ప్రథమ చికిత్స చేసి పల్నాడు జిల్లా నరసరావుపేటకు తరలిస్తుండగా చనిపోయారు. గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన స్వగ్రామం పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం రచ్చమళ్లపాడు గ్రామం.