News August 27, 2024
ఒంగోలు: ‘ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ’
ఒంగోలు రూట్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 30 రోజులపాటు, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత అర్హులని, వయస్సు 19- 45 ఉండి రేషన్, ఆధార్ కార్డులు కలిగి ఉండాలన్నారు. శిక్షణా కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.
Similar News
News September 19, 2024
FLASH.. పవన్ కళ్యాణ్‌తో బాలినేని భేటీ
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితం విజయవాడలో కలిశారు. నిన్న YCPకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్‌ను కలవడంతో జనసేనలో చేరుతారనే వార్తలకు బలం చేకూరాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎప్పడు పార్టీలో చేరుతారు. ఈయనపై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన జిల్లా జనసేన ఇన్‌ఛార్జ్ రియాజ్, MLA దామచర్ల ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.
News September 19, 2024
ఒంగోలు: కంప్యూటర్, ట్యాలీపై ఉచిత శిక్షణ
ఒంగోలు రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి కంప్యూటర్, ట్యాలీ నందు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాలు కలిగి ఉండి, గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ మహిళలకు ఈ అవకాశం ఉంటుందన్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలని, శిక్షణ సమయంలో శిక్షణతో పాటు భోజన, వసతి కల్పించనున్నట్లు వెల్లడించారు.
News September 19, 2024
నేను ఆ మాటలు అనలేదు: బాలినేని
ప్రతిపక్షంతో పాటు స్వపక్షంతోనూ తాను ఎన్నో బాధలు ఎదుర్కొన్నట్లు బాలినేని చెప్పారు. ‘సామాజికవర్గ న్యాయమంటూ నా పదవి పీకేశారు. ముందు ప్రకాశం జిల్లాలో ఎవరికీ మంత్రి పదవి లేదని.. చివరకు సురేశ్‌కు ఇచ్చారు. ఈడ్రామాలు అవసరమా? YSను తిట్టిన వాళ్లనూ మంత్రిగా కొనసాగించారు. పిల్ల కాంగ్రెస్, పెద్ద కాంగ్రెస్ కలిసిపోతోందని నేను చెప్పినట్లు నాపై దుష్ర్పచారం చేశారు. నేను ఆ మాటలు అనలేదు’ అని బాలినేని చెప్పారు.