News August 27, 2024

ఒంగోలు: ‘ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ’

image

ఒంగోలు రూట్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 30 రోజులపాటు, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత అర్హులని, వయస్సు 19- 45 ఉండి రేషన్, ఆధార్ కార్డులు కలిగి ఉండాలన్నారు. శిక్షణా కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.

Similar News

News September 17, 2024

ఎమ్మెల్యే బూచేపల్లి హౌస్ అరెస్ట్

image

తమ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దర్శిలో నేడు నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఉదయం ఆయన నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ వెంకాయమ్మకు నోటీసులు అందజేసి గృహ నిర్బంధం చేస్తున్నట్లు ఎమ్మెల్యేకు సూచించారు. వారితో పాటు, టీడీపీ నాయకులకు సైతం నోటీసులు ఇచ్చారు.

News September 17, 2024

బాలినేని దారెటు?

image

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి ఎపిసోడ్ పలు మలుపులు తిరుగుతూ సాగుతోంది. ఆయన ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇక ఓటమి తర్వాత ఒంగోలులో రీ వెరిఫికేషన్ కోసం చేస్తున్న ప్రయత్నాన్ని పార్టీ అధిష్ఠానం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇటీవల మళ్లీ ఆయన పార్టీ మారుతున్నట్లు పెద్ద చర్చే జరిగింది. దీంతో ఆయన దారెటు అంటూ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

News September 17, 2024

ప్రకాశం: ఇవాళ్టి నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు

image

జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్‌ 2వ వరకూ స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ తమీమ్ అన్సారియా తెలిపారు. అక్టోబర్‌ 2న స్వచ్ఛ భారత్‌ దివస్‌ జరపనున్నట్లు తెలిపారు. స్వభావ్‌ స్వచ్ఛత – సంస్కార్‌ స్వచ్ఛత నినాదంతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చెప్పారు.