News September 20, 2024
ఒంగోలు: కంప్యూటర్ ట్యాలీలో ఉచిత శిక్షణ

ఒంగోలు రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ వరకు మహిళలకు కంప్యూటర్ ట్యాలీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాకు చెందిన 19-45 ఏళ్ల వయస్సు గల నిరుద్యోగ మహిళలు అర్హులని అన్నారు. శిక్షణా కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. వివరాలకు 4/11, భాగ్య నగర్, దామచర్ల సక్కుబాయమ్మ కాలేజ్ ఒంగోలులో సంప్రదించాలన్నారు.
Similar News
News November 10, 2025
ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్.!

ప్రకాశంలో 11వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పీసీ పల్లిలోని పెదఇర్లపాడు వద్ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు పెదయిర్లపాడు హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. 10.35 నుంచి 12.15 వరకు పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత హెలికాప్టర్లో తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు.
News November 9, 2025
వెయ్యి మందికి రూ.9 కోట్ల సాయం: మంత్రి స్వామి

టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామి CMRF చెక్కులు పంపిణీ చేశారు. మర్రిపూడి మండలం పలువురికి మంజూరైన చెక్కులను ఆదివారం ఆయన అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యం పట్ల సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొండపి నియోజకవర్గంలో దాదాపు వేయ్యి మందికి రూ.9కోట్ల వరకు సాయం చేశామని వెల్లడించారు.
News November 9, 2025
ప్రకాశం జిల్లాకు CM రాక.. కారణమిదే!

ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు 11న రానున్నారు. పారిశ్రామిక రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పీసీపల్లి మండలం లింగన్నపాలెం సమీపంలో 20 ఎకరాల భూమిలో రూ. 7కోట్లతో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేశారు. దీనిని నిర్మాణానికి గత నెల కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర శంకుస్థాపన చేశారు. పనులు పూర్తి కావడంతో దీనిని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.


