News January 7, 2025

ఒంగోలు: కానిస్టేబుళ్ల రాత పరీక్షకు 233 మంది ఎంపిక

image

ఒంగోలులోని పోలీస్ పెరేడ్ మైదానంలో సోమవారం జరిగిన కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో 233 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. మొత్తం 600 మంది అభ్యర్థులకు గాను 319 మంది మాత్రమే హాజరయ్యారు. వారికి ఉదయం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం పలు ఈవెంట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ దామోదర్, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Similar News

News January 9, 2025

వైకుంఠ ఏకాదశి.. ప్రకాశం ఎస్పీ కీలక ఆదేశాలు

image

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దర్శనం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టామన్నారు.

News January 9, 2025

కొత్త వైరస్.. ఒంగోలు GGHలో 20 బెడ్లు ఏర్పాటు

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎంపీ వైరస్‌ నివారణలో భాగంగా.. ఒంగోలులోని GGHలో 20 బెడ్లు ఏర్పాటు చేశామని, ఎక్స్‌పర్ట్ కమిటీతోపాటు పలు కమిటీలను నియమించామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున తెలిపారు. మగవారికి 10 బెడ్లు, మహిళలకు 10 బెడ్ల చొప్పున ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. డాక్టర్ కళ్యాణి HOD జనరల్ మెడిసిన్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చారు.

News January 9, 2025

ప్రకాశం: ‘రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి’

image

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించి, ప్రభుత్వ ఆసుపత్రి పట్ల మరింత గౌరవాన్ని పెంచే విధంగా వైద్యులు పనిచేయాలని కలెక్టరు తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం కలెక్టర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని (జీజీహెచ్) సందర్శించి అన్నీ విభాగాల హెచ్ఓడిలతో సమావేశమై, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ, అందిస్తున్న వైద్య సేవలపై క్షుణ్ణంగా సమీక్షించారు.