News June 3, 2024
ఒంగోలు: కుమారుడిని కాల్చి చంపిన తండ్రి అరెస్ట్

కుమారుడిని తుపాకీతో కాల్చిచంపిన కానిస్టేబుల్‌ను 302 సెక్షన్ కింద ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏఆర్ కానిస్టేబుల్ కొదమల ప్రసాద్ బాబు గార్డ్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ప్రసాద్ కుమారుడు శేషుకమల్ జీతం డబ్బులు డ్రా చేసుకొని ఇంట్లో ఇవ్వమని తండ్రిని అడగ్గా.. ప్రసాద్ నిరాకరించాడు. దీంతో మాటామాటా పెరిగి.. కోపంతో తన సర్వీస్ రివాల్వర్‌తో శేషును కాల్చడంతో శేషుకుమార్ చనిపోయాడు.
Similar News
News December 16, 2025
ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉగ్ర నరసింహారెడ్డి?

కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైనట్టు సమాచారం. ఇటీవల ఒంగోలులో జిల్లా అధ్యక్షుని ఎంపికపై పరిశీలకులు, నాయకుల అభిప్రాయాలను సేకరించారు. సామాజిక సమీకరణలతో పాటు వివిధ కోణాల్లో లోతుగా పరిశీలన చేసిన టీడీపీ అధిష్ఠానం ఉగ్రకు ఈ పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది.
News December 16, 2025
వాట్సాప్ గవర్నెన్స్‌తో ప్రకాశం పోలీస్ మరింత ముందుకు!

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందే పోలీస్ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు కోరారు. ప్రకాశం జిల్లా ఐటీ విభాగం పోలీసులు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందే పోలీస్ సేవలపై ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఈ చలానా చెల్లింపులు, ఎఫ్ఐఆర్ డౌన్లోడ్, కేసుల స్థితిగతులను తెలుసుకొనే అవకాశం ఉందన్నారు. అందరూ 9552300009 నంబర్ సేవ్ చేసి, HI అని మెసేజ్ చేయాలన్నారు.
News December 16, 2025
ప్రకాశం జిల్లాకు జోన్-4 కేటాయింపు

APలోని 26 జిల్లాలను జోన్ల వారీగా విభజించే క్రమంలో ప్రకాశం జిల్లాను జోన్-4 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-4గా చోటుదక్కింది.


