News February 28, 2025
ఒంగోలు: ‘క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిండి’

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు గురువారం తన ఛాంబర్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు పైబడిన వారికి నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఏఎన్ఎంలు క్యాన్సర్ అనుమానిత కేసులను వైద్యాధికారికి తెలపాలన్నారు.
Similar News
News April 23, 2025
ఒంగోలు: వార్డు మెంబర్ నుంచి టీడీపీ అధికార ప్రతినిధి వరకు

ఒంగోలులో దారుణంగా హత్యకు గురైన ముప్పవరపు వీరయ్య చౌదరి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు మేనల్లుడు. ఈయన 2013 నుంచి 2018 వరకు అమ్మనబ్రోలు గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్‌గా ఎన్నికై అనంతరం ఉపసర్పంచ్‌గా ఉన్నారు. అనంతరం చవటపాలెం ఎంపీటీసీగా ఎన్నిక కాబడి నాగులుప్పలపాడు ఎంపీపీగా ఐదు సంవత్సరాలు ఉన్నారు. ప్రస్తుతం బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధికార ప్రతినిధిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
News April 23, 2025
నేడు ప్రకాశం జిల్లాకు రానున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురికావడంతో వారి మృతదేహానికి నివాళి అర్పించడానికి చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు రానున్నారు. అంతిమయాత్రలో సీఎం పాల్గొంటారని టీడీపీ శ్రేణులు తెలిపాయి. అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
News April 23, 2025
చంద్రబాబే లిక్కర్ స్కాం చేశారు: తాటిపర్తి

లిక్కర్ స్కాంపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అసలు లిక్కర్ స్కాం ఎవరు చేశారు? 2014-19 మధ్య చంద్రబాబు చేసిన లిక్కర్ స్కాం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబే స్కాం చేశారని రాష్ట్రప్రభుత్వానికి చెందిన సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. మరి ఇప్పుడు ఈ కేసు ఏమైంది? ఎందుకు నడవడం లేదు? ’ అని ఎమ్మెల్యే తాటిపర్తి ట్వీట్ చేశారు.