News January 25, 2025

ఒంగోలు: గణతంత్ర వేడుకల ఏర్పాట్ల పరిశీలన

image

76వ గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమం నిర్వహించే పోలీసు పరేడ్ గ్రౌండ్‌ను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. SP దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణలతో కలిసి పరిశీలించారు. ఈ వేడుకలలో పాల్గొనేందుకు, వీక్షించేందుకు వచ్చేవారి హోదాను, సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

Similar News

News October 25, 2025

ప్రకాశంను వదలని వాన.. నేడు కూడా దంచుడే.!

image

ప్రకాశంను వర్షం వదిలేలాలేదని వాతావరణ శాఖ తెలిపింది. సూర్యుడు ఉదయించని రోజులను జిల్లా ప్రజలు వరుసగా 3 రోజులుగా చవిచూస్తున్నారు. తాజాగా ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం నేటి నుంచి ఆగ్నేయ, దాని ప్రక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందన్నారు. సోమవారంకు ఇది తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

News October 25, 2025

ప్రకాశం: జిల్లాలోని ఇల్లులేని పేదలకు గుడ్ న్యూస్.!

image

ప్రకాశం జిల్లాలోని ఇల్లులేని పేదలకు కలెక్టర్ రాజాబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఇల్లులేని పేదలను గుర్తించేందుకు కేంద్రం చేపట్టిన సర్వేకు నవంబర్ 5 వరకు గడువు ఉందని గురువారం కలెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సచివాలయ, గృహ నిర్మాణ శాఖ సిబ్బంది ఇంటింటి సర్వే చేయనున్నట్లు, జిల్లా ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News October 25, 2025

ప్రకాశం: విద్యుత్ సమస్య తలెత్తితే కాల్ చేయండి.!

image

ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ లైన్లు తెగిపడితే తప్పక విద్యుత్ శాఖ ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. ఒంగోలులోని విద్యుత్ భవన్‌లో ఆయన మాట్లాడారు. తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు విరిగినా కంట్రోల్ రూమ్ నంబర్ 9440817491కు సమాచారం అందించాలని ఆయన కోరారు.