News November 20, 2024
ఒంగోలు: చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై UPDATE

ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని పత్తేపురంలో మంగళవారం <<14653215>>మధ్యాహ్నం దొరికిన ఆడ శిశువు<<>>ను సంతమాగులూరు ప్రాథమిక వైద్యశాలకు తరలించిన విషయం తెలిసిందే. ప్రాథమిక వైద్య సేవలు చేయగా.. శిశువు 3KGల బరువు ఉందని.. పొలాల్లో పడేయడంతో ఆక్సిజన్ అందక డీహైడ్రేషన్ అయినట్లు తెలిపారు. శిశువుకు పొట్ట కాస్త ఉబ్బుగా ఉందన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని, మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించామన్నారు.
Similar News
News December 3, 2025
ప్రకాశం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ప్రకాశం జిల్లాలోని వివిధ ఉన్నత, ప్రైమరీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకై కాంట్రాక్టు పద్ధతిన అకడమిక్ ఇన్స్పెక్టర్స్ను నియమిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఒంగోలులోని డీఈఓ కార్యాలయం నుంచి ఆయన ప్రకటన విడుదల చేశారు. అర్హులైనవారు ఈనెల 5లోగా దరఖాస్తులను మీ పరిధిలోని MEOలకు అందజేయాలన్నారు. వివరాలకు స్థానిక MEOలను సంప్రదించాలన్నారు.
News December 3, 2025
ప్రకాశం జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలివే.!

ప్రకాశం జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా ప్రకటించింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు సగటు వర్షపాతం 0.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. మంగళవారం రాత్రి ఒంగోలుతోపాటు పలు మండలాలలో మోస్తరు వర్షపు జాడ కనిపించింది. దిత్వా తుఫాను ప్రభావం జిల్లాపై అంతంత మాత్రమేనని చెప్పవచ్చు.
News December 3, 2025
సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రకాశం కలెక్టర్.!

ప్రకాశం కలెక్టర్ రాజాబాబు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ రాజాబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఒక్కొక్క అధికారి, ఒక్కొక్క వసతి గృహాన్ని దత్తత తీసుకోవాలని కలెక్టర్ నిర్ణయించారు. దీంతో ఆయా వసతి గృహాల్లో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కార దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.


