News September 18, 2024

ఒంగోలు: నిరుద్యోగ మహిళలకు GOOD NEWS

image

ఒంగోలు రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 01 వరకు, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాకు చెందిన 19- 45 ఏళ్ల వయస్సు గల నిరుద్యోగ మహిళలు అర్హులని అన్నారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. వివరాలకు 4/11, భాగ్య నగర్, దామచర్ల సక్కుబాయమ్మ కాలేజ్ ఒంగోలులో సంప్రదించాలన్నారు.

Similar News

News October 5, 2024

ప్రకాశం: ‘ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేపట్టండి’

image

ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు సవరణలకు సంబంధించి సెప్టెంబరు నెలాఖరు వరకు వచ్చిన దరఖాస్తులను రెండు రోజులలోగా పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అధికారి ఆర్.శ్రీలత సంబంధిత అధికారులకు చెప్పారు. ఈ నెల 29వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించాల్సి ఉన్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన ఛాంబరులో ఆమె సమీక్ష నిర్వహించారు.

News October 4, 2024

జె. పంగులూరు: నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి

image

బాపట్ల జిల్లా జె. పంగులూరు మండలం బోదవాడలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి చిన్నారులు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. దసరా సెలవులకు తాత గారి ఊరు వచ్చిన చిన్నారులు సాయంత్రం ఆడుకుంటూ ఇంటి వెనక ఉన్న నీటి కుంటలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కందుల బ్రహ్మారెడ్డి (8), కందుల సిద్ధార్థ రెడ్డి (6) మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

News October 4, 2024

ప్రకాశం: బైక్‌ టైర్‌లో చున్నీ ఇరుక్కుని.. మహిళ మృతి

image

సంతమాగులూరు మండలం ఏల్చూరులోని పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బైక్ వెనుక టైర్‌లో చున్నీ చుట్టుకోవడంతో రోడ్డు మీదపడి బల్లికువ మండలం కొప్పెరపాడుకు చెందిన మహిళా అక్కడకక్కడే మృతి చెందింది. నరసరావుపేట నుంచి కొప్పెరపాడు వైపు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.