News April 3, 2025
ఒంగోలు: నేటి నుంచి 10th స్పాట్ వ్యాల్యువేషన్

10th పబ్లిక్ పరీక్షలు ఈ నెల 1వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. కాగా గురువారం నుంచి 10th స్పాట్ వ్యాల్యువేషన్ నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని డీఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్‌లో స్పాట్ వ్యాల్యువేషన్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సోషల్ స్టడీస్‌కు సంబంధించిన టీచర్స్‌కు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని, మిగిలిన సబ్జెక్టులకు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయని తెలిపారు.
Similar News
News April 11, 2025
ప్రకాశం జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

ప్రకాశం జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 67 పరీక్షా కేంద్రాల్లో 42,439 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సర విద్యార్థులు 21,624 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 20,815 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 11, 2025
మార్కాపురం: రైలు ఢీకొని ప్రాణాలతో బయటపడ్డాడు

మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మార్కాపురంలోని విజయ టాకీస్ ఏరియాకు చెందిన అయ్యప్ప అనే వ్యక్తి రైలు పట్టాల వద్దకు చేరుకున్నాడు. మార్కాపురం నుంచి గుంటూరు వెళ్లే రైలు కింద ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. దీంతో రైలు ఢీకొన్న వెంటనే అయ్యప్ప పక్కకు పడిపోవడంతో తీవ్ర గాయాలై ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే రైల్వే పోలీసులు చేరుకుని అతడిని వైద్యశాలకు తరలించారు.
News April 11, 2025
ప్రకాశం: నిప్పులు కురిపించిన భానుడు

కనిగిరి నియోజకవర్గంలోని నందన మారెళ్ళలో గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా 41.8° ఉష్ణోగ్రత నమోదయినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగులోపు అత్యవసరం అయితే తప్ప బయట తిరగవద్దు అని పేర్కొన్నారు.